#


Index

భక్తి యోగము

భేషు సమః - శీతోష్టాలూ సుఖ దుఃఖాలూ ఇలాటి ద్వంద్వాలేవైనా సరే. సమః సమానంగానే భావించ గలడు. ఆత్మ చైతన్య నిర్విశేషంగా చూడగలడు. ఇలాటి సమన్వయమెలా చేసుకోగలడు జ్ఞాని. దానికి కారణమొక్కటే. సంగ వివర్జితః - సంగమనేది ఏమాత్రమూ లేదు జ్ఞానికి. సంగమంటే స్పర్శ. సంపర్కం Contact. జ్ఞానమే జ్ఞాని స్వరూపం. జ్ఞానం నిరాకారం. వ్యాపకం. ఆకాశం లాంటిదది. అలాటి దానికి శత్రుమిత్రాది భావాలు గాని మానపమానాలు గాని సుఖదుఃఖాదులు గాని ఎలా అంటుతాయి. అంటట మనేది సాకారానికే గాని నిరాకారాని కసంభవం. ఆకాశాని కిప్పుడేమైనా అంటుతుందా. బ్రహ్మాండమైన వర్షం కురుస్తున్నా తడిసిపోదది. అతి తీక్షమైన ఎండ గాస్తున్నా కమిలిపోదది. అలాగే ఆకాశం కన్నా విలక్షణమైన చిదాకాశ స్వరూప మాత్మ అంటే. అదే తన స్వరూపమని దానితో తాదాత్మ్యం చెందిన జ్ఞానికీ ద్వంద్వా లేవి గానీ ఎలా అంటగలవు. అంటవని చెప్పటంలో ఆశ్చర్యమేముంది.

తుల్యనిందా స్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్
అనికేతః స్థిరమతి - ర్భక్తిమాన్ మే ప్రియో నరః - 19


  అంచేత ఆత్మ జ్ఞాని కంతా సమానమే. జ్ఞేయంగా కనిపించిందతా జ్ఞానాత్మకమే. జ్ఞాతైవ జ్ఞేయ భావేన సదా సర్వత్ర సంస్థితః జ్ఞానమే జ్ఞేయ రూపంగా సర్వదా సర్వత్రా పరుచుకొని ఉన్నట్టు దర్శిస్తుంటాడు. అలాటి

Page 537

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు