మరొకరిని ప్రేమిస్తుంటారు. అజ్ఞానంతో వారలా ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు. కాని జ్ఞాని అలా ప్రవర్తించడు. లోకులకు ద్వంద్వాత్మకంగా కనపడుతున్న దంతా వీడికి నిర్ద్వంద్వంగా ఏకంగా గోచరిస్తుంటుంది. అనాత్మగా చూస్తే విషమం గాని ఆత్మ స్వరూపంగా దర్శిస్తే అంతా సమమే గదా. కాబట్టి అన్ని ద్వంద్వాలూ తన స్వరూపంగా చూస్తాడే గాని స్వరూపాన్నే ద్వంద్వాత్మకంగా చూడడు. అలాంటప్పుడు లోకులకు కనిపించే శత్రుమిత్ర భావాలు జ్ఞానికి విజాతీయంగా ఎలా గోచరించ గలవు. రెండూ కలిసి తన చైతన్య స్వరూపంగానే ఏకమై భాసిస్తాయని భావం.
శత్రు మిత్రాది ద్వంద్వ మొక్కటే కాదు. అన్ని ద్వంద్వాలూ అంతే. వాటిపాటికవి వేరయినా ఆత్మ స్వరూపంగా ఏకమే. తరంగ బుద్బుదాదు లెలాగైతే సముద్ర జలానికి వేరుగా చూస్తే విజాతీయమూ విషమమూ అయినా జలాకారంగా దర్శిస్తే సమానమో అలాగే శత్రుమిత్ర రూపంగా చూస్తే పరస్పర విరుద్ధమైనా చైతన్య రూపంగా భావిస్తే ఏకమే. అవిరుద్ధమే. తధా మానాపమానయోః అలాగే మానావ మానాలనే తేడా కూడా చూడడు. జ్ఞాని. ఒకరు తన్ను పూజించినా వేరొకరు పరాభవించినా సంతోషించడు జ్ఞాని. ద్వేషించడు. రెండూ తన స్వరూపం తాలూకు విభూతిగానే దర్శించగలడు. స్వరూప విస్తారమే గదా విభూతి. అదే అనేక రూపాలలో దర్శనమిస్తున్నదని వినోదంగా చూడగలడు జ్ఞాని. అదేగాదు. శీతోష్ణ సుఖదుః
Page 536