#


Index

భక్తి యోగము

ప్రియః - ఆ జ్ఞానే భక్తుడు. వాడే నాకు చాలా ఇష్టమైన వాడని కీర్తిస్తున్నాడు. పరమాత్మ.

సమః శత్రాచ మిత్రేచ తథా మానాపమానయోః
శీతోష్ణ సుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః - 18


  ఇంకా పరిగణిస్తున్నాడు జ్ఞాని గుణగణాలను. సమః శత్రాచ మిత్రేచ. ఒకడు శత్రువనీ మరొకడు మిత్రుడనీ లేడు జ్ఞానికి. ఇద్దరూ సమానులే. అయితే శత్రువును మిత్రుడుగా మిత్రుణ్ణి మరలా శత్రువుగా చూస్తాడా అని అశంక రావచ్చు. శత్రువును మిత్రుడుగా నంటే పరవాలేదు గాని మిత్రుణ్ణి మరలా శత్రువుగా చూస్తాడంటే వాడేమి జ్ఞాని. శత్రువే లేడని చెప్పాలి. అప్పుడేవాడు జ్ఞాని. అంతేగాని శత్రువునూ మిత్రుణ్ణి సమానంగా చూస్తాడంటే అప్పటికి జ్ఞానికి శత్రువున్నాడని అంగీకరించినట్టే గదా. ఇప్పుడీ మాటల్లో రెండు ప్రమాదాలు వచ్చి పడ్డాయి. ఒకటి మిత్రుణ్ణి కూడా శత్రువుతో సమానుడనే సరికి మిత్రుడనే వాడు కూడా జ్ఞానికి శత్రువే అయి కూచుంటాడు. రెండవదేమంటే మిత్రుడూ శత్రువూ ఇద్దరూ సమానులే అవటం మూలాన అయితే జ్ఞానికి శత్రువులు న్నారని ఒప్పుకొన్నట్టయింది. మరేమిటి దీనికి పరిష్కారం.

  అది గాదు వ్యాస మహర్షి హృదయం. లోకులందరూ కొందరిని శత్రువులని మరికొందరిని మిత్రులని విషమంగా చూస్తూ ఒకరిని ద్వేషించి

Page 535

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు