యోన హృష్యతి న ద్వేష్టి నశోచతి న కాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ - భక్తి మాన్య స్సమే ప్రియః - 17
ఇంకా జ్ఞాని ఎలా ఉంటాడో వాడి ప్రవర్తన ఎలాటిదో వర్ణిస్తున్నాడు మహర్షి యో నహృష్యతి న ద్వేష్టి - ఇష్టమైనది లభిస్తే ఎవడు పొంగిపోడో అనిష్టమైనది ప్రాప్తిస్తే ఎవడు కుంగిపోడో వాడు జ్ఞాని. అంటే రాగద్వేషాలు లేనివాడని భావం. రాగద్వేషా లెప్పుడు లేకుండా పోతాయో. నశోచతి నకాంక్షతి. అప్పుడిక శోకం లేదు. కాంక్ష లేదు వాడికి. శోక మోహాలే అన్ని అనర్థాలకూ మూలం. కారణ శరీరమదే. అజ్ఞానమే గదా కారణ శరీరమంటే. జ్ఞాని కజ్ఞానమే లేనప్పుడిక శోకమోహాలనే ప్రశ్నేముంది. షడూర్ములలో మోహమూ శోకమూ అనే రెండూ తొలగిపోయాయంటే శుభాశుభ పరిత్యాగీ మంచీ చెడ్డా రెండూ తొలగినట్టే. మంచే కలగాలనీ చెడ్డ కలగ కూడదనే కామం మానవుడి కవిద్య వల్లనే ఏర్పడుతుంది. అవిద్యా కామకర్మలన్నారు. అవిద్య పోతే కామం పోతుంది. కామం పోతే కర్మ పోతుంది. సర్వారంభ పరిత్యాగీ అని మొదటనే పేర్కొన్నాడు. అంటే కర్మ లేదని అర్థం. కర్మకు కారణమైన కామం లేదన్నా డిప్పుడు. ఇవి రెండూ లేవంటే అవిద్య లేదా అజ్ఞానం కూడా లేదనే గదా అర్థం. అజ్ఞానం లేకుండా పోవాలంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానముండి తీరాలి. జ్ఞాని కదావాడు. అలాంటప్పు డజ్ఞానం లేదని వేరే చెప్పటం దేనికి. అజ్ఞానమే లేకుంటే ఇక కామకర్మల సంపర్క మసలే లేదు జ్ఞానికి. భక్తిమాన్ యస్సమే
Page 534