#


Index

భక్తి యోగము

ఉండాలి. అంతగా పట్టించుకో గూడదు వాటినని వివరిస్తారు భాష్యకారులు. అలాగే శుచిః బాహ్యేన ఆభ్యంతరేణ శౌచేన సంపన్నః - బాహ్యాభ్యంతరాలు రెండింటిలో శౌచం అనగా పరిశుద్ధుడయి ఉండాలట. దక్షః ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్యః యథావత్ ప్రతిపత్తుం సమర్ధః - ఎప్పుడెప్పుడేయే పరిస్థితు లెదురవుతుంటే వాటిని త్రోసి పుచ్చకుండా యధోచితంగా జవాబు చెబుతూ పోవాలి. అదే దక్షత అంటే. సమర్ధత అని అర్థం. అలాగే ఉదాసీనో గతవ్యధః ఒకరితో ఒకరు పేచీ పడుతుంటే ఎవరి పక్షమూ అవలంబించ కుండా తటస్థంగా మౌనంగా ఉండిపోవట ముదాసీనత. గతవ్యధః ఉదాసీనుడైతే ఇక ఏ వ్యథా లేదు మనసుకు. అంతేకాదు. సర్వారంభ పరిత్యాగీ ఆరంభాలన్నీ మానేయాలి. ఏదీ పెట్టుకోరాదు. ఆరంభాలంటే వ్రాస్తున్నారు గురువుగారు. ఆరభ్యంత ఇతి ఆరంభాః ఏవి ఆరంభిస్తూ పోతామో అలాటి కర్మలన్నీ ఆరంభాలే. ఏమిటవి. ఇహా ముత్ర ఫలభోగార్థాని కామహేతూని కర్మాణి. ఐహికమైన ఆముష్మికమైన సుఖాలన్నీ అనుభవించాలంటే కోరిక పెట్టుకొని చేసే పనుల వన్నీ. జ్ఞాని క విద్యా గంధమే లేదు కాబట్టి కామమనే ప్రసక్తి లేదు. కామం లేకుంటే తజ్జన్యమైన కర్మలసలే లేవు. కర్మలసలే లేవంటే శాస్త్రోక్తమైన కర్మలని అర్థం. ప్రారబ్ధ కర్మలు మాత్ర ముంటాయి. ఉపాధి ఉన్నంత వరకూ అవి తప్పవు కాబట్టి ఆత్మ జ్ఞాన బలంతో వాటి నెప్పటికప్పుడు జ్ఞానాగ్నిలో లయం చేసుకొంటూ అనుభవిస్తుంటాడు జ్ఞాని. కాబట్టి వాడి మోక్షమార్గాని కడ్డురావవి కూడా.

Page 533

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు