
న్నోద్విజతే చయః కనుక లోకం వల్ల కూడా వాడికి ఎలాటి ఉద్వేగమూ కలగదనే చెప్పాలి.
పోతే హర్షామర్ష భయోద్వేగై ర్ముక్తోయ స్సచమే ప్రియః - హర్షమూ అమర్షమూ భయమూ ఉద్వేగమూ అని నాలు గవ లక్షణా లున్నాయి. హర్షమంటే ఉత్సాహంతో పొంగిపోవటం. అమర్షమంటే అసహనంతో కుమిలిపోవటం. భయమంటే చూడలేక హడలిపోవటం - క్రోధమంటే కోపంతో ఊగిపోవటం. ఇలాంటి అవలక్షణా లన్నిటికీ ముక్తః - దూరమైన వాడెవడో వాడు నిజమైన జ్ఞాని. ప్రతి ఒక్క దానికీ కంగారు పడ్డా గాబరా పడ్డా కుంగిపోయినా పొంగిపోయినా అది భేద దృష్టే గాని అభేద దృష్టి కాదు. అభేద దృష్టి కనుకూలం ప్రతికూల మనే తేడా రాగూడదు. వచ్చిందో రెండూ స్వరూపమని చూడటం లేదు వాడు. అలా చూచినవాడే జ్ఞాని. ప్రియః నాకిష్టుడని కితాబిస్తున్నాడు పరమాత్మ.
అనపేక్షః శుచిర్దక్షః - ఉదాసీనో గతవ్యథః
సర్వారంభ పరిత్యాగీ - యోమద్భక్త స్సమే ప్రియః - 16
అంతే కాదు. ఇలాటి అవగుణాలు లేకపోవటమే గాక ఆవశ్యకమైన మంచి లక్షణాలు కనపడాలి జ్ఞాని అయిన వాడికి. అనపేక్షః అనపేక్షుడయి ఉండాలి వాడు. దేహేంద్రియ విషయ సంబంధాదు లందరికీ లోకంలో కావలసినవే. అనివార్యమైనవి. అలాటి వాటిమీద నిః స్పృహుడయి
Page 532
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు