
పేర్కొన్నాడు భగవానుడు. కాబట్టి ఇక్కడ భక్తుడని పేర్కొన్న వాడెవడో గాదు. ముందు పేర్కొన్న ఆ జ్ఞానే సుమా అని మనలను హెచ్చరిస్తున్నారు భగవత్పాదులు. ఎంత గొప్ప పూర్వాపర సమన్వయమో చూడండి ఇది. అప్పటి కిక్కడ వర్ణిస్తున్న భక్తుడు సగుణ భక్తుడు కాదు నిర్గుణ భక్తుడి వ్యవహారమే నని అర్థం చేసుకోవాలి మనం.
యస్మాన్నో ద్విజతే లోకో - లోకా న్నోద్విజతే చయః
హర్షా మర్ష భయోద్వేగై - ర్ముక్తోయ స్సచమే ప్రియః - 15
ఇంకా జ్ఞాని ఎలా ఉంటాడంటే చెబుతున్నాడు. యస్మాన్నో ద్విజతే లోకః - లోకులందరూ ఎవడి మూలంగా పరితపించరో సంక్షోభం పాలుగారో - అలాగే లోకుల వల్ల ఎవడు కలవరపడి పరితపించడో వాడు జ్ఞాని. ఒకరి జోలికి తాను పోడు జ్ఞాని అంటే అర్థముంది. ఎందుకంటే జ్ఞాని ఒకరి నెప్పుడూ బాధించబోడు. కాని లోకుల కంత జ్ఞానం లేదు గనుక వారు బాధించవచ్చు గదా జ్ఞానినని అడగవచ్చు. అచ్చమైన జ్ఞాని అంతగా ఎవరితోనూ పూసుకోకుండా తనపాటికి తానాత్మా రాముడయి బ్రతుకుతుంటాడు. కాబట్టి వారికీ అతణ్ణి అదేపనిగా బాధించాలని బుద్ధి పుట్టదు. పరమాత్మ వారి కలాటి బుద్ధి పుట్టించడు. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ వారికా దుర్భుద్ధి పుట్టినా దానిమూలంగా వాడు బాధపడడు కూడా. లోకా
Page 531
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు