#


Index

భక్తి యోగము

కాక నేనీ వ్యష్టి రూపమైన మనోబుద్ధులేనని వీటినే అభిమానిస్తూ కూచుంటే జీవాత్మ భావం వదిలిపోదు. పోకుంటే తాను వేరు పరమాత్మ వేరనే జీవేశ్వర భేదమంతకన్నా వీడిపోదు. మరి అలాటి భేద దృష్టి ఉన్నంత వరకూ వాడు జ్ఞాని ఎలా అవుతాడు. కాబట్టి పరమాత్మ స్వరూపుణ్ణి అనిపించుకోవాలంటే జీవలక్షణమైన మనోబుద్ధుల నా సమష్టి చైతన్యంలో ప్రవిలయం చేయక తప్పదు. అప్పుడే వాడు జ్ఞాని.

  కాగా ఇలాటి జ్ఞానికే భక్తుడని పేరు చెల్లుతుంది. భక్తుడంటే సగుణ భక్తుడని భ్రాంతి పడతామేమోనని భగవత్పాదులదే పనిగా హెచ్చరిస్తున్నారు. య ఈదృశః మద్భక్తః సమేప్రియః ఇలాంటి నిర్గుణోపాసకుడైన జ్ఞాని ఎవడో వాడే నా భక్తుడని పేర్కొంటున్నాడట భగవానుడు. దీని కుపోద్బలకంగా మరొక గీతా వాక్యాన్ని కూడా ఉదాహరిస్తున్నా రాయన. ప్రియోహి జ్ఞానినోత్యర్ధ మహం సచ మమ ప్రియః ఇతి సప్తమే అధ్యాయే సూచితం తదిహ ప్రపంచ్యతే - జ్ఞాని అయినవాడెవడో వాడే నాకు ప్రియుడు వాడికి కూడా నేనే ప్రియుణ్ణి అని సప్తమాధ్యాయంలో భగవానుడేది సూత్రప్రాయంగా చెప్పాడో అదే ఇక్కడ ఈవాక్యంలో వివరిస్తున్నాడట. నిజమే. సమేప్రియః సచమే ప్రియః అని ప్రియ అనే మాట అక్కడా ఇక్కడా వస్తున్నది. ఆప్రియుడనే వాడెవడని అడిగితే అక్కడ జ్ఞాని అని వాచా

Page 530

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు