బ్రతుకుతుంటాడు. తృప్తి అంటే ఏదో చెబుతున్నారు స్వామివారు. దేహ స్థితి కారణస్య లాభే అలా భే చ ఉత్పన్నాలం ప్రత్యయః - తధా గుణవల్లాభే విపర్యయే చ సంతుష్టః - శరీరం నిలవటానికేది కావాలో అది లభించినా తనకు లభించక పోయినా ఇంతవరకే చాలు నాకనే భావముండాలి జ్ఞానికి. అంతేకాదు. ఆ లభించిన పదార్ధం మంచిదా లేదా అని కూడా తాపత్రయం పెట్టుకోరాదు. తనకేది ప్రాప్తమో అదే మహాప్రసాదమనే భావంతో స్వీకరించాలి. అదే సంతోషమంటే. యస్త్వాత్మ రతి రేవ స్యాదాత్మ తృపశ్చ మానవః ఆత్మేన్యేవ చ సంతుష్టః అని ఆత్మారాముడైన జ్ఞాని లక్షణాలు చెప్పేటప్పు డిలాగే వర్ణించారింతకు ముందు వ్యాస భగవానుడు. దానికిది ప్రతిధ్వని. ఇంతకు ముందేగా పేర్కొన్నాడు సమదుఃఖ సుఖః అని. మరి సుఖదుఃఖాది ద్వంద్వాలు సమానంగా చూడగలవాడిలా ఎక్కడికక్కడ సంతృప్తి చెందకపోతే ఎలా. వాడేమి జ్ఞాని.
పోతే మయ్యర్పిత మనోబుద్ధిః - మనస్సూ బుద్ధి పరమాత్మకే అప్పజెప్పాలట. మనస్సంటే వికల్పాత్మకం. బుద్ధి అంటే నిశ్చయాత్మకం. అవి రెండూ పరమాత్మ కప్పగించటమంటే వ్యష్టి చైతన్యాన్ని సమష్టి చైతన్యంగా దర్శించటమని అర్థం. వ్యష్టి జీవుడైతే సమష్టి పరమాత్మ. జీవుడు తాను పరమాత్మనని భావించినప్పుడే దాని కర్థముంటుంది. అలా
Page 529