#


Index

భక్తి యోగము

వన్నీ విశేషాలే సృష్టిలో. విశేషాలనేవి సామాన్యంలో నుంచే వస్తాయి. సామాన్యంలోనే ఉంటాయి. తుదకు సామాన్యం లోనే అంతరిస్తాయి. ఆగమాపాయులవి. వాటి జన్మస్థానం లయస్థానం సామాన్యమే. అందులోనూ మహాసామాన్య మాత్మ చైతన్యం. అందులో సమసిపోని విశేషమంటూ లేదు. కాబట్టి ఒక్క సుఖదుఃఖా లేమిటి. అన్ని ద్వంద్వాలూ అక్కడ లయమయి పోవలసిందే. సుఖదుఃఖాలనేవి కేవల ముపలక్షణంగా Indication or representation చెప్పిన మాట. అవి రెండూ లేవంటే అప్పటికి జ్ఞాని జీవ జగద్భూమికలు రెండూ దాటి సర్వాత్మ భావమందుకొన్న వాడని తాత్పర్యం. అలాటివాడు గనుకనే క్షమీ. క్షమావాన్. సహనశీలుడయి ఉంటాడు. ఆక్రుష్టః అభిహతో వా అవిక్రియ ఏ వాస్తే అని భాష్యం. తిట్టూ కొట్టూ. ఏమైనా చేయి. ఏవికారమూ చెందడు జ్ఞాని. సామాన్య స్వరూపుడు గదా. వికారమెలా ఏర్పడుతుంది. కాకున్నా వికారమే గదా విశేషం.

సంతుష్ట స్సతతం యోగీ - యతాత్మా దృఢ నిశ్చయః
మయ్యర్పిత మనో బుద్ధి - ర్యో మద్భక్త స్సమే ప్రియః - 14


  సంతుష్ట స్సతతం యోగీ. యోగి అంటే ఇక్కడ జ్ఞానయోగి. జ్ఞాని అని అర్థం. జ్ఞాని అయిన వాడెప్పుడూ సంతుష్టః - సంతృప్తిగా

Page 528

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు