సంకుచితంగా భావించటం మిధ్యాత్మ. ఇదే అహంకారం. పోతే దానికి బాహ్యంగా కనిపించేదంతా ఇక నేను కాదని అనాత్మ ప్రపంచంగా భావించటం గౌణాత్మ. ఇదే మమకారం. మొదటిది జీవభావమైతే రెండవది a. Mind and Matter. knower and the known. సంసారమంతా ఇదే. ఇదే అన్ని సమస్యలకూ మూలభూతమైన ఏకైక సమస్య. ఇది తొలగితే చాలు. మిగతావన్నీ తొలగిపోయినట్టే. ఎలా తొలగుతుందది. నేనీ దేహం మేరకే కాదు సర్వజగత్తునూ వ్యాపించి సర్వాత్మకంగా ఉన్న చైతన్యమే నేననే అఖండ భావన ఉదయిస్తే చాలు. పటా పంచెలవుతుంది. అప్పుడది ఇప్పుడున్న అహం కాదు. మమ కాదు. రెండింటినీ అతిక్రమించిన పూర్ణాహంకారం. జీవుడు కాడప్పుడు. వాడు జీవన్ముక్తుడు. జీవాత్మ స్థాయి దాటి ప్రత్యగాత్మ స్థాయి కెదిగితే గాని అది అలవడదు. అంటే జ్ఞాని పరమాత్మ స్వరూపుడే అనిపించుకొనే భావమది.
పోతే సమదుఃఖ సుఖః క్షమీ. జీవన్ముక్తు డెప్పుడయ్యాడో వాడికిక సుఖదుఃఖాది ద్వంద్వాలు పనిచేయవు. సుఖదుఃఖేసమే కృత్వా. రెండింటినీ ఏకంగా భావిస్తాడు. తన స్వరూపంలో రెండూ లయమవుతాయి. ప్రతిపక్ష భావాలు opposites సమస్తమూ సర్వవ్యాపకమైన చైతన్యంలో లయం కాక తప్పవు. ఎందుకంటే చైతన్యమనేది సామాన్య స్వరూపం Universal. మిగతా
Page 527