#


Index

భక్తి యోగము

కూడా లేకపోవచ్చు గదా. ఉందని ఏమి గారంటీ. కాబట్టి దేనిమీదా ద్వేషమే లేదు. ఉన్నదంతా సౌహార్దమేనని పేర్కొనటం చాలా బాగుంది.

  కరుణ ఏవచ. ఇంతకూ ద్వేష రహితుడూ స్నేహ సహితుడే కాక కరుణార్ధ హృదయుడు కూడా జ్ఞాని. కరుణా కృపా దుఃఖితేషు దయా తద్వాన్ కరుణః సర్వభూతా భయప్రదః సన్న్యాసీ ఇత్యర్థః అని వ్యాఖ్యానించారు భాష్యకారులు. ద్వేషం లేక కేవలం సానుభూతి ఉండటమే గాదు. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని శక్తి కొలదీ ఆదుకొనే కారుణ్యం కూడా ఉంటుంది జ్ఞానికి. ఉంటేనే అసలు వాడు జ్ఞాని. అందరికీ అభయమివ్వాలి. తన వరకూ తాను చూచుకొంటే వాడు జ్ఞాని ఎలా అవుతాడు. స్వార్ధపరుడని పించుకొంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున - సుఖంవా యది వా దుఃఖమని ఇంతకు పూర్వమే వచ్చిందీ భావం.

  అలాగే నిర్మమో నిరంహాకారః అని మరొక రెండు లక్షణాలు వర్ణిస్తున్నాడు. అహంకార మమకారాలు రెండింటినీ దాటిపోవాలి జ్ఞాని. అహ మనేది కర్తృత్వ బుద్ధినీ మమ అనేది భోక్తృత్వ బుద్ధినీ సూచిస్తాయి. కర్తా భోక్తా అయినవాడే జీవుడు. అవి రెండూ ఒకటి మిధ్యాత్మ మరొకటి గౌణాత్మ అని శాస్త్రీయమైన భాష. దేహం మేరకే నేనున్నానని ఆత్మను

Page 526

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు