#


Index

భక్తి యోగము

తనతో పాటు తిరుగుతున్న ఏ ప్రాణినీ ద్వేషించ గూడదు. ప్రాణమున్నదే గాదు. ప్రాణం లేని వస్తుజాలాన్ని కూడా ద్వేషించరాదు. ఆత్మనః దుఃఖ హేతు మపిన కించిత్ ద్వేష్టి అని వ్రాస్తున్నారు స్వామివారు. తనకు దానివల్ల బాధ కలుగుతుందని తెలిసి కూడా త్రోసి పుచ్చాలని భావించరాదట. ఎందుకని అడిగితే అంటున్నారాయన. సర్వాణి భూతాని ఆత్మత్వేన హి పశ్యతి. జ్ఞాని గనుక సమస్త భూతాలనూ తన స్వరూపంగానే చూడవలసి ఉందివాడు. అలాంటప్పుడెలా ద్వేషించగలడు దేన్ని మాత్రం. అనాత్మ అయితే గదా. అది కూడా ఆత్మే వాడికి. పోతే రెండవది మైత్రః - మైత్రితో మెలగేవాడికి మైత్రుడని పేరు. Friend to all ప్రతి ఒక్క ప్రాణి విషయంలో సుహృద్భావంతో ఉంటాడు జ్ఞాని. ఎవరినీ ద్వేషించడన్నప్పుడు అందరికీ మిత్రుడని వేరే చెప్పాలా. ద్వేషం లేనివాడు మిత్రుడుగాక శత్రువెలా అవుతాడు. మరి ఎందుకు చెప్పినట్టు. ఎందుకంటే అద్వేష్టా అనేది ప్రతిలోమంగా Negative చెప్పిన మాట. మైత్రః అనేది అలా కాక అనులోమంగా Postive చెబుతున్న మాట. అలా ఎడాపెడా చెబితే గాని గట్టి పడదు భావం. ఇక్కడ దుర్వాసన లేదని ఎవడైనా అన్నాడను కోండి. అంత మాత్రాన సువాసన ఉందనుకో నక్కర లేదు. దుర్వాసన లేదంత మాత్రమే. అలాగే ద్వేషం లేదు తోటి వారి మీద. అంతమాత్రాన మైత్రి

Page 525

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు