#


Index

భక్తి యోగము

ఉంటుంది గీత. ఆ మాట విని మన ములిక్కి పడరాదు. సగుణ భక్తుడికీ నిర్గుణ భక్తుడికీ ఇద్దరికీ వర్తిస్తుంది భక్తి అనే మాట. కాని ఇది సగుణం కాదు నిర్గుణమని అర్థం చేసుకోవాలి మనం. భక్త అంటే అనన్య భక్తుడూ జ్ఞాని అని గ్రహిస్తూ పోతే చాలు. ఈ సూక్ష్మం వ్యాస భగవానుడూ సూచిస్తాడు. శంకర భగవత్పాదులూ బయట పెడతారు చివర చివర.

అద్వేష్టా సర్వభూతానాం - మైత్రః కరుణ ఏవచ
నిర్మమో నిరహంకారః - సమదుఃఖ సుఖః క్షమీ - 13


  అద్వేష్టా అని ఆరంభించి ముప్పయి రెండు ముప్పయి మూడు లక్షణాలు వర్ణిస్తూ పోతాడు మహర్షి. ఇవన్నీ అక్షరోపాసకుడైన జ్ఞాని లక్షణాలు. ఇలాటి లక్షణాలే రెండు మూడు చోట్ల కనపడతాయి భగవద్గీతలో మనకు. మొదట స్థితప్రజ్ఞ లక్షణాలు వర్ణించింది గీత సాంఖ్యయోగంలో. ఇక్కడ భక్తి యోగమనే అధ్యాయంలో భక్తుడి లక్షణాలను వర్ణిస్తున్నది. పదమూడవ దైన క్షేత్ర జ్ఞాధ్యాయంలో జ్ఞాని కుండవలసిన గుణాలేమిటో అక్కడా వర్ణిస్తుంది. మళ్లీ గుణత్రయ యోగమనే పధ్నాలుగవ అధ్యాయంలో గుణాతీతుడి లక్షణాలు వర్ణించ బోతుంది. తరువాత మళ్లీ పదహారవదైన దైవాసురాధ్యాయంలో దైవ సంపన్నుడి లక్షణాలు వర్ణిస్తుంది. ఇలా చూస్తూ పోతే నాలుగైదు సార్లు అక్కడక్కడా జ్ఞాని లక్షణాలు ప్రస్తావనకు వస్తూనే

Page 523

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు