జ్ఞానికే ఉంటుంది. కాబట్టి వాడికసలైన భగవత్తత్త్వమేదో అదే అనుభవానికి వస్తుంది. సగుణ భక్తుడి కలాటి అభేద బుద్ధి లేదు కాబట్టి స్వామి భృత్య భావం వదలిపోదు. దానికి తగిన కర్మయోగా దికమైన కలాపమూ కావలసి నంత ఉంటుంది. అంతేగాక వాడొక ఈశ్వరుణ్ణి తనకు భిన్నంగా భావిస్తుంటాడు కాబట్టి వాణ్ణి ఆ ఈశ్వరుడే ఉద్దరించాలి. అప్పటికీ అది సాక్షాత్తుగా మోక్ష మివ్వదు. జ్ఞానం ద్వారానే అందుకోవాలది ఎప్పటికైనా. పోతే నిర్గుణో పాసకుడి కలాటి గొడవ లేదు. అభేద దర్శి అయిన జ్ఞాని కాబట్టి వాడికొక ఈశ్వరు డంటూ లేడు. వాడికి వేరుగా ఒక జీవుడంటూ లేడు. వాడి నందుకోటాని కొక కర్మానుష్ఠానాది కలాప మంటూ లేదు. కేవల బ్రహ్మాకార వృత్తి అయిన జ్ఞానమే చాలు. అదేవాడికి సాక్షా న్మోక్ష ప్రదాయకం. అందుకోసం లోకాంతర గమనం - ఈశ్వర సాయుజ్యమనే ప్రయత్నమేదీ లేదు. దేశకాలా ద్యుపాధులుంటే గదా ఒక ప్రయాణమూ ఒక అందుకోటమనే ప్రశ్న. అది కూడా తన స్వరూపంగా చూచే జ్ఞాని కిక ఏది మిగిలిపోయిందని దాని వెంట బడటానికి. ఇందులో మామూలు భక్తుల వ్యవహారమంతా ముందు వర్ణించి ప్రస్తుతం నిర్గుణోపాసకులైన జ్ఞానుల స్వరూపమేమిటో వర్ణించబోతున్నాడు. ఈ అధ్యాయం చివర దాకా ఇక ఇదే వర్ణన. ఇక్కడ ఒక హెచ్చరిక. జ్ఞానిని కూడా భక్తః అని పేర్కొంటూనే
Page 522