వలసి ఉంటుందని. యదిహి ఈశ్వరస్య ఆత్మ భూతా స్తేమతాః అభేద దర్శిత్వాత్ నిజంగా వారు అభేద దర్శులే అయి ఈశ్వరుడి కాత్మ స్వరూపులే అనే అభిప్రాయమే ఉంటే వారు కూడా అక్షర స్వరూపులే గదా. ఇక వారిని నేనుద్ధరిస్తానని చెప్పే మాట కర్థమేముంది. అది పేలవమని పించుకొంటుందా మాట. సముద్ధరణ వచనం తాన్రతి అపేశలం స్యాత్ అంటారాయన.
అంతేకాదు. యస్మాచ్చ అర్జునస్య అత్యంత మేవ హితైషీ భగవాన్
తస్య సమ్యగ్దర్శనా నన్వితం కర్మయోగం భేద దృష్టి మంత మేవ ఉపదిశతి.
అర్జునుడికి చాలా హితైషి అయి కూడా భగవానుడతనికి సమ్యగ్దర్శనం
కాని భేద దృష్టితో కూడిన కర్మయోగమే ఉపదేశించాడు. చూచారో లేదో.
నచ ఆత్మానం ఈశ్వరం ప్రమాణతో బుద్ధ్వా కస్యచిత్ గుణభావం జిగమిషతి
కశ్చిత్. తన్ను తాను ఈశ్వరుడేనని ప్రామాణికంగా గుర్తించిన వాడెవడూ
ఈశ్వరుడికి నేనధీనుడనని భావించడు. విరోధాత్. ఒక పక్క ఈశ్వరుడు
నేనే ననుకొంటూ ఆ ఈశ్వరుడికి నేను భృత్యుడనని ఎలా భావిస్తాడు.
అన్యోన్య విరుద్ధమది. తస్మాత్ అక్షరోపాసకానాం సమ్యగ్దర్శన నిష్ఠానాం
సన్న్యాసినాం త్యక్త సర్వైషణానాం అద్వేష్టా సర్వ భూతానా మిత్యాది
ధర్మపూగం సాక్షాదమృతత్త్వ కారణం వక్ష్యామితి ప్రవర్తతే. అంచేత
Page 520