#


Index

భక్తి యోగము

  పోతే అసలు విషయమేమంటే అత్రచ ఆత్మేశ్వర భేద మాశ్రిత్య విశ్వరూపే ఈశ్వరే చేత స్స మాధాన లక్షణః యోగః ఉక్తః ఈశ్వరార్ధం కర్మానుష్ఠానాదిచ. ఇక్కడ జీవేశ్వరుల కిద్దరికీ భేదముందనే భావాన్ని అనుసరించి విశ్వరూపుడైన ఈశ్వరుడి మీద మనసు లగ్నం చేసే భక్తి యోగం వర్ణించి చెప్పాడు. అంతేగాక ఈశ్వరుడి కోసమే అన్ని కర్మలూ కూడా అనుష్ఠించమనీ సలహా ఇచ్చాడు. ఇది ఎలా చెప్పగలిగామంటే అధైత దప్యశక్తోసి ఇతి అజ్ఞాని కార్యసూచనాత్. ఇది కూడా చేయలేని పక్షంలోనని అజ్ఞాని వ్యవహారాన్ని సూచించటం వల్ల. అంతేగాని న అభేద దర్శినః అక్షరోపాస కస్య కర్మయోగః ఉపపద్యత ఇతి దర్శయతి. జీవేశ్వరుల కభేదమని చూచే అక్షరోపాసకులైన జ్ఞానుల కలాటి కర్మయోగం అక్కర లేదని చూపుతున్నాడు. కర్మయోగినః అక్షరోపాసనా నుపపత్తిం. అలాగే కర్మ యోగి అయిన వాడి కక్షరోపాసన కూడా చెల్లదని చూపుతున్నాడు. తేప్రాప్ను వంతి మామేవ ఇతి అక్షరోపాసకానాం కైవల్య ప్రాప్తా స్వాతంత్ర్యముక్త్వా ఇతరేషాం పారతంత్య్ర మీశ్వరా ధీనతాం దర్శితవాన్ తేషా మహం సముద్ధర్తా ఇతి. వారు నన్నే పొందగలరని అక్షరోపాసకులకు కైవల్య ఫలం పొందటంలో స్వాతంత్ర్యాన్ని చెప్పి మిగతా సగుణ భక్తులకు ఈశ్వరా ధీనమైన పారతంత్ర్యాన్ని చెబుతూ వచ్చాడు వారిని నేనే ఉద్ధరించ

Page 519

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు