కర్మణి ప్రవృత్తస్య. జ్ఞానాని కెదగలేని సాధకుడెప్పుడూ కర్మతోనే కాలక్షేపం చేస్తుంటాడు. పూర్వోప దిష్టో పాయా నుష్ఠానా శక్తి ఇంతవరకూ పేర్కొన్న భూమికల ననుసరిస్తూ పోయే ఓపిక లేదు వాడికి. అలాంటి వాడికేమిటి గతి అంటే సర్వ కర్మణాం ఫలత్యాగః శ్రేయ స్సాధన ముపదిష్టం. ఏ కర్మ చేసినా దాని ఫలమాసించ కుండా ఈశ్వరార్పణ బుద్ధితో త్యాగం చేయటమే శ్రేయస్సాధనమని ఉపదేశించాడు భగవానుడు. న ప్రథమ మేవ. మొదట్లోనే చెప్పలేదది. అదేదీ చేసే తాహతు లేకుంటే చివరకు చెప్పిన మాట అది. అది కూడా మానేస్తారేమోనని శ్రేయోహి జ్ఞాన మభ్యాసా దిత్యుత్తరోత్తర విశిష్టత్వో దేశేన సర్వకర్మ ఫలత్యాగః స్తూయతే. ఉత్తరోత్తరం గొప్పదంటూ చివరిసారిగా కర్మఫల త్యాగ మన్నిటి కన్నా గొప్పదని ప్రశంసించటం జరిగింది. ఫలత్యాగ స్తుతి రియం ప్రరోచనార్ధా. ఇది కేవలం ప్రరోచన కోసమే. యధా అగస్త్యేన బ్రాహ్మణేన సముద్రః పీత ఇతి ఇదానీం తనా అపి బ్రాహ్మణాః బ్రాహ్మణత్వ సామాన్యాత్ స్తూయంతే. ఇది ఎలాటిదంటే అగస్త్యుడనే బ్రాహ్మణుడు పూర్వం సముద్ర జలాన్ని పానం చేశాడని చెప్పి బ్రాహ్మణత్వ సామ్యంతో ఈనాటి బ్రాహ్మణులు కూడా ప్రశంసించ బడుతున్నారో అలాంటిది. ఏవం కర్మఫల త్యాగాత్ కర్మ యోగస్య శ్రేయస్సాధనత్వ మభిహితం. మొత్తానికి ఫలత్యాగమనే మాట వల్ల కర్మయోగం శ్రేయస్సా ధనమని చెప్పినట్టయింది.
Page 518