జ్ఞానపూర్వకంగా చేయాలే గాని గుడ్డిగా చేస్తే ప్రయోజనం లేదని భగవత్పాదుల అభిప్రాయం. ఇందులో నాకు స్ఫురించే సత్యమేమంటే నాలుగు భూమికలలో కూడా జ్ఞానమనేది ఉండి తీరాలని చెబుతున్నారు కాబట్టి నిర్గుణో పాసనా రూపమైన బ్రహ్మ జ్ఞానమే అన్నిటి కన్నా ఉత్తమమైన సాధన. అలాటి జ్ఞానం కోసమని చేసే సగుణ రూపమైన అభ్యాసం మధ్యమమైనది. ఆ జ్ఞాన మనేదే లక్ష్యంగా పెట్టుకొని ఆచరించే ధ్యానం లేదా కర్మయోగ మనేది మందాధికారి వ్యవహారం. మూడవది. పోతే నాలుగవది యోగం కాకపోయినా ఫలత్యాగమైనా పాటిస్తే అది కూడా ఎప్పటికైనా అంచెల వారిగా జ్ఞానానికే దారితీస్తుంది కాబట్టి మంచిదే. మొత్తం మీద ఆత్మ జ్ఞానమనేదే గమ్యం. ఆ గమ్యాన్ని అప్పుడే అందుకొన్న జ్ఞాని సర్వోత్తముడు. అది అప్పుడే అందుకొనే తాకత్తు లేని వారందరికీ చెప్పిన వివన్నీ. భక్తి అయినా కర్మ అయినా ధ్యానమైనా త్యాగమైనా చిత్తశుద్ధినీ ఏకాగ్రతనూ ప్రసాదించి ఆత్మజ్ఞాన మందుకోటానికి తయారు చేస్తాయి సాధకుణ్ణి. అంతవరకే వాటి ప్రయోజనం. ఇదీ ఇందులో ఉన్న ఆంతర్యం.
ఇదంతా మనసులో పెట్టుకొని మిగతా భూమికలన్నీ ఆత్మ జ్ఞానాని కెలా తోడ్పడతాయో వాటికున్న పరస్పర సంబంధ మేమిటో చక్కగా వివరిస్తూ రాబోయే గ్రంధాని కవతారిక వ్రాస్తున్నారు భగవత్పాదులిక వినండి. అజ్ఞస్య
Page 517