#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

తరం జ్ఞానం. భగవానుడు వేరు నేను వేరని వివేచనా బుద్ధితో అభ్యసించటం మంచిదే అయినా అది సరియైన వివేచన కాదు కాబట్టి అంతకన్నా మంచిది సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞానం. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. పోతే కేవల జ్ఞానం కంటే జ్ఞాన పూర్వకం ధ్యానం విశిష్యతే. జ్ఞాన పూర్వకమైన ధ్యానం గొప్పది. అలాగే జ్ఞానవతో ధ్యానా దపి కర్మఫల త్యాగః విశిష్యతే. జ్ఞానవంతుడి ధ్యానం గొప్పదే అయినా దానికన్నా గొప్పది అతడు చేస్తున్న కర్మఫల త్యాగం. అలాగే ఏవం కర్మ ఫల త్యాగాత్ పూర్వ విశేషణ వతః శాంతి రుపశమః సహేతు కస్య సంసారస్య అనంతర మేవ స్యాత్. నతు కాలాంతర మపేక్షతే. ఫలత్యాగం కన్నా ముందు చెప్పిన నాలుగు గుణాలూ పరిపాకానికి వచ్చిన సాధకుడికి సహేతుకమైన సంసారం పూర్తిగా తొలగి పోవటం ఖాయం. అదీ వాడు జీవించి ఉండగానే లభిస్తుందా ఫలం. కాలాంతరం దాకా వేచి ఉండనక్కర లేదంటారు ఆచార్యుల వారు.

  పోతే ఇందులో ఒక సూక్ష్మముంది మనం గ్రహించవలసింది. జ్ఞానం జ్ఞానమనే మాట విడవకుండా పట్టుకొని అర్థం చెబుతున్నారాయన ప్రతి భూమికలో. అభ్యాసం చేసినా నీవు జ్ఞానంతో చేయాలి. ధ్యానం చేసినా జ్ఞానంతోనే ధ్యానించాలి. అలాగే కర్మ ఫలాన్ని త్యాగం చేసినా జ్ఞానంతోనే త్యాగం చేయాలి. కర్మ అను. అది భక్తి అను. త్యాగమను. ఏదైనా

Page 516

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు