అనుకొంటుంది. గుఱ్ఱం లాంటిదది. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మాట వినదు. కళ్లెం చేత బట్టి నడప గలిగితే చాలు. ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ప్రయాణం సుఖంగా సాగిపోతుంది. అలాంటిదే ఇక్కడా వ్యవహారం.
శ్రేయోహి జ్ఞాన మభ్యాసాత్- జ్ఞానా ధ్యానం విశిష్యతే
ధ్యానా త్కర్మ ఫల త్యాగః - త్యాగా చ్ఛాంతి రనంతరమ్ - 12
మొత్తం మీద సాధన మార్గంలో ఒకటిగాదు. నాలుగు మజిలీలు వర్ణించి చెప్పాడు మనకు భగవానుడు. నాలుగూ సర్వోత్తమమని భ్రాంతి పడరాదు. ఉత్తమమైన సాధన ఒకటే. అది చేతగాకుంటే రెండవది. అది లేకుంటే మూడవది. అదీ లేదంటే నాలుగవది పాటించమని ఆయన సలహా. అంతేకాదు. నాలుగవది మూడవ దానికీ మూడవది రెండవదానికీ రెండవది మొదటిదానికీ దోహదం చేసి ఆ మూటివల్లా మొదటిది బాగా బలం పుంజుకొని అది ఒకే ఒక సాధనంగా మోక్షమనే సిద్ధి నీకందిస్తుందని ఉపదేశం. కాబట్టి వీటిలో ఏ ఒక్కటైనా పాటించక సోమరిగా జీవయాత్ర సాగించాడంటే వాడు మానవుడే కాదు. వాడి మానవ జన్మ వృధా అని కూడా ఒక గొప్ప హెచ్చరిక ఇది.
భగవత్పాదులు దీనిమీద బ్రహ్మాండంగా భావన చేసి వ్యాఖ్యానిస్తున్నారు వినండి. శ్రేయోహి జ్ఞాన మభ్యాసాత్. అవివేక పూర్వకా దభ్యాసాత్ ప్రశస్య
Page 515