భక్తి యోగము
భగవద్గీత
అధైత దప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః
సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ - 11
ఇప్పటికి రెండు రాయితీలిచ్చాడు పరమాత్మ. మొదట భక్తి యోగం చెప్పాడు. తరువాత దానికి స్తోమత లేకపోతే రెండవది కర్మయోగం చెప్పాడు. అదీ చేయలేక పోతే ఏమిటి మార్గమని ఇప్పుడు ప్రశ్న. దానికి కూడా సమాధాన మిస్తున్నాడు.
అథైత దప్య శక్తేసి కర్తుం - కర్మయోగానికి కూడా శక్తి లేదా నీకు. అది కూడా చేయలేవా. అయితే ఒక పని చేయి. మద్యోగ మాశ్రితః - నా యోగాన్ని పట్టుకో. ఏమిటా యోగం. వివరిస్తున్నారు భాష్యకారులు. మయి క్రియ మాణాని కర్మాణి సన్న్యస్య యత్కరణం తేషా మను స్థానం మద్యోగః - నీవు త్రికరణాలతో చేసే ప్రతి పనీ ఒక సేవకుడు స్వామి కోసమని కూడా కాదు. స్వామి కోసమైనా చేస్తూనే ఉంటాడు సేవకుడూరక కూచోడు. ఇక్కడ అది గాదు. స్వామి తన పనే నాచేత చేయిస్తున్నాడు నేను గాదీ పని చేయట మాయనగారే ననే భావంతో చేస్తూ పోవాలి. నేననే బుద్ధితో గాదు. నేను పరమాత్మే. ఆయన కొక ఉపాధి నేను. నాద్వారా ఆయనేతన పని తాను చేసుకొంటున్నాడు. కాబట్టి దాని ఫలితం కూడా నాది గాదు. ఆయనదే. సర్వకర్మఫల త్యాగం కురు. అలాటి భావనతో
Page 513