భక్తి యోగము
భగవద్గీత
అది చేత కాకుంటే ఏమి చేయాలని ప్రశ్న వచ్చింది. మత్కర్మ పరమో భవ అని సలహా ఇస్తున్నాడు. వివరిస్తున్నారు భాష్యకారులు. మదర్ధం కర్మ మత్కర్మ భగవ త్రీత్యర్థమని చేసే ప్రతి కర్మా మత్కర్మ. తత్పరమః తత్ప్రధానః మత్కర్మ పరమః - అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని భృత్యవ త్కరోమి. నాపని గాదిది నాకోసం కాదు. ఒక యజమానుడి పని సేవకుడెలా చేస్తాడో అలాగా విశ్వానికంతా అధిపతి అయిన నా స్వామి కోస మనుకొంటూ నేనీ పనులన్నీ సాగిస్తున్నానని అదే లోకంగా బ్రతకాలి.
అలా బ్రతికితే ఏమవుతుంది. మదర్ధ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. ముందు పేర్కొన్న అభ్యాసం లేకపోయినా పరవాలేదు. నాకోసమనే భావంతో మనోవాక్కాయా లతో నీవే పని చేసినా చాలు. సిద్ధిమవాప్స్యసి. సిద్ధి పొందగలవు. సిద్ధి అంటే ఏమిటిక్కడ అర్థం. వ్రాస్తున్నారు భగవత్పాదులు. సత్త్వ శుద్ధి యోగ జ్ఞాన ప్రాప్తి ద్వారేణ. కర్మయోగం వల్ల చిత్త శుద్ధి ఏర్పడితే అది జ్ఞాన ప్రాప్తికి దారి తీస్తుంది. అలాటి జ్ఞానం ద్వారా ఏది కలుగుతుందో అదీ సిద్ధి. అంతేగాని ఎక్కడికక్కడ కలిగేది కాదు. అలాగైతే కర్మయోగం వల్లనే ముక్తి లభిస్తుందని చెప్పినట్టవు తుంది. కాదు. కర్మయోగం వల్లా కలగదు. భక్తి యోగం వల్లా కలగదు. అవి కేవలం ద్వారాలు మాత్రమే. వాటి ద్వారా ఉదయించిన బ్రహ్మ జ్ఞానం వల్లనే ఎప్పటికైనా మోక్షం.
Page 512