భక్తి యోగము
భగవద్గీత
రాదు. దానికి సాధనమైన ఆత్మ జ్ఞానాన్ని క్రమంగా ప్రసాదిస్తుందది. అంటే ఏమన్న మాట. భక్తి జ్ఞానానికి తోడ్పడితే జ్ఞానం మోక్షాన్ని అందిస్తుంది. ఇదీ వరస. అంచేత మధ్యమాధికారి అయిన మానవుడు సగుణంగా పరమాత్మను త్రికరణ శుద్ధిగా భజించట మెంతైనా మంచిది. అదే సలహా ఇస్తున్నాడిప్పు డర్జునుడికి కృష్ణ పరమాత్మ. మయ్యేవ మన ఆధత్స్వ. మయి అంటే నాయందని అర్థం. నా అంటే ఎవరానా. అక్షరమూ అవ్యక్తమూ ఆత్మ స్వరూపమని పేర్కొన్న పరమాత్మా. కాదు. విశ్వరూపే ఈశ్వరే అని అర్థం వ్రాస్తున్నారు భగవత్పాదులు. భక్తి ప్రసంగం వచ్చినప్పుడల్లా విశ్వరూప ఈశ్వర అని వదలి పెట్టకుండా వర్ణిస్తారాయన. ఎందుకంటే అది నిర్గుణమైన బ్రహ్మతత్త్వమను కొంటారేమోనని భయమాయనకు. అందుకే అది తప్పించటానికలా వర్ణిస్తాడు. ఇంతకూ విశ్వ రూపాత్మకంగా భావించాలి పరమాత్మను. ఆయనకే ఈశ్వరుడని God పేరు. సమష్టి చైతన్యమది. దానిమీదనే మనసు పెట్టమంటున్నాడు. మనసంటే సంకల్ప వికల్పాత్మకం. వ్యష్టిరూపమైన చంచలమైన మనసు నక్కడ పెడితే అది అచంచలమైన సమష్టిని భావించగలదు. అలాగే మయి బుద్ధిం నివేశయ. బుద్ధిని కూడా దానిపైనే నిలుపు. నిశ్చయాత్మకమైన మనసే బుద్ధి. మనసూ బుద్ధీ ఏకం చేసి దాన్ని పట్టుకొంటే తదుపాధి అయిన జీవుడా ఈశ్వర భావమే పొందగలడు.
Page 507