భక్తి యోగము
భగవద్గీత
అంటే భక్తి భక్తిగా ముక్తినివ్వదు. అది జ్ఞానంగా మారి ఆ జ్ఞానం వల్ల లభిస్తుందీ భక్తుడికి. ఇలాటి బుద్ధి యోగం లేదా జ్ఞానమనేది వాడికి ప్రసాదించటమే భగవానుడు వారి నుద్ధరించట మనే మాట కర్థం. అదే మృత్యు సంసార సాగరాన్ని దాటిస్తుంది వారిని. అదంటే ఏది. భక్తి యోగం కాదు. దాని పరిపాకం వల్ల కలిగే జ్ఞానయోగం. అలా కలగజేయటమే భగవానుడు వారినీ సంసార సాగరం నుంచి బయట పడేయటం. ఇంత ఉన్నదిందులో ఆంతర్యం. అతోనాత్ర విసంవాదః కోపి. భవామి నచిరాత్పార్ధ అనే భగవద్వచనం కూడా దీన్నే సమర్థిస్తున్నది. నచిరాత్ ఎంతో కాలం పట్టదు. త్వరలోనే అంటే భక్తి తీవ్ర స్థాయి నందుకొంటే ఎంతో కాలం గడవకుండానే జ్ఞాన ముదయిస్తుంది. అది ఉదయించట మేమిటి. వెంటనే సంసార బంధం సడలిపోయి ముక్తి లభించటమేమిటి. త్రుటిలో జరిగిపోతుందని భావం.
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ
నివసిష్యసి మయ్యేవ - అత ఊర్థ్వం న సంశయః - 8
కాబట్టి ఇంతకూ చెప్పవచ్చే దేమంటే ఆత్మ జ్ఞానానికే నోచుకోగలిగితే అన్నిటికన్నా ఉత్తమం. సాక్షాత్తూ సర్వాత్మ భావరూపమైన మోక్షఫలాన్నే చవి చూడగలవు. అలా కాక సగుణ రూపంగా పరతత్త్వాన్ని పట్టుకొని కూచుంటావో అదీ తక్కువది కాదు. కాని మోక్షఫల మప్పుడే అనుభవానికి
Page 506