భక్తి యోగము
భగవద్గీత
మనుకోవచ్చు. కోతి తన పిల్లల నెక్కడికీ కొనిపో నక్కర లేదు. అది ఎక్కడ తిరుగుతుంటే ఇవి దాని పొట్ట నంటి పట్టుకొని దానిలాగే సంచరించగలవు. అలాటి వారు జ్ఞానులు.
మంచిదే. బాగానే ఉంది వివరణ. కాని ఒక్క సందేహం. భగవానుడు తన భక్తుల నుద్ధరిస్తా డనేంత వరకూ బాగానే ఉంది. కాని మృత్యు సంసార సాగరాత్. మృత్యు రూపమైన సంసార క్లేశం వారికి లేకుండా చేస్తాడనట మేమి బాగు. మృత్యువు లేకుండా పోవాలంటే అది బ్రహ్మ జ్ఞానంతోనే గాని కేవల భక్తితో కాదు గదా. అంతే గాక భగవానుడిచ్చే దేమిటి మనకు మోక్షం. ఒకరిచ్చేది గాదది. మనం తెచ్చుకొనేది. అందుకే సాధన చెప్పింది శాస్త్రం. అది ఒక్క జ్ఞానం తప్ప మరేదీ గాదు. అంచేత భగవాను డెవరికీ ఇచ్చేదిగాదది. అలా ఇచ్చే మాటే అయితే జ్ఞాని అయినా కాకున్నా అందరికీ మూకుమ్మడిగా ప్రసాదించ వచ్చు గదా. అలాంటి దెప్పటికీ జరగదీ సృష్టిలో. అయితే మరేమిటీ మాట. ఏమిటర్ధం. దాని కర్థమేదో గాదు. ఇంతకు పూర్వం విభూతి యోగంలో చెప్పాడొక మాట. అది గుర్తు చేసుకొంటే చాలు. అందులోనే ఉంది దీనికి సమాధానం. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం యేన మా ముపయాంతితే. నన్ను భజించే భక్తులకు నేను బుద్ధియోగమిస్తాను. దాని బలంతో వారు నన్ను పొందగలరని అర్థం.
Page 505