భగవత్స్వరూపం. దానితో విభక్తమైతే మనకది తోడ్పడదు. అవిభక్తమై దాన్ని అంటి పట్టుకొంటేనే పైకి లేపుతుంది. అలాటి వాడే భక్తుడు. విభక్తుడు కాడు వాడు. భక్తుడు. అంటే దానినే అంటి పట్టుకొన్న వాడని అర్థం. ఎలా పట్టుకొన్నాడు వాడు. మయ్యావేశిత చేతసాం. మయి విశ్వరూపే ఆవేశితం సమాహితం చేతః యేషాంతే. విశ్వరూపుడనైన నామీదనే మనసు నిలిపిన వాడని అర్థం చెప్పారు భాష్యకారులు. చూచారా వివ్వరూపుడు ఈశ్వరుడు అనే రెండు మాటలూ వదలి పెట్టటం లేదాయన. ఈశ్వరుడంటే సగుణమైన బ్రహ్మం. ఆయన గుణం విశ్వరూపం. అప్పటికి భక్తు దారాధిస్తున్నది శుద్ధమైన బ్రహ్మం గాదు. శబలబ్రహ్మం. గుణ విశిష్టమైనది. కనుకనే భక్తులు తమ పాటికి తాము పొందలేరు గమ్యాన్ని. వారిది మార్జర కిశోర న్యాయం. పిల్లి కూనలు తమ పాటికి తాము స్వతంత్రంగా ఎక్కడికీ పోలేవు. పిల్లి తన నోట కరుచుకొని తీసుకెళ్ల వలసిందే. అలాంటి వారీ భక్తులు. అందుకే తేషా మహం సముద్ధర్తా వారిని నేనే ఉద్దరిస్తానంటున్నాడు భగవానుడు. దీనికి భిన్నంగా తేప్రాప్నువంతి మామేవ నిర్గుణోపాసకులైన జ్ఞానులను నే నుద్ధరించ పని లేదు. వారు నా అసలు స్వరూపమే పట్టుకొని దాన్ని తమ ఆత్మగానే దర్శిస్తున్నారు కాబట్టి వారి పాటికి వారే అందుకోగల రంటాడు. వారిది మార్జార కిశోర న్యాయమైతే వీరి దలాకాక మర్కట కిశోర న్యాయ
Page 504