
అది ఏదో గాదు ఈ సంసారమే. సంసార సాగరమంటారు. నిజంగా ఒక మహాసాగరమే ఇది. సాగరానికైనా ఒక పార మవారమని ఉంటుంది. కాని దీనికేదీ లేదు. ఆద్యంతాలు లేక అనంతంగా విస్తరించిన గంభీరమైన సాగరమిది. మునగటమే గాని తేలటం లేదు. తేలినా తీరం చేరటమని లేదు. కారణం మృత్యు రూపమిది. ఆది మధ్యావ సానాలు మూడు దశలలోనూ ప్రతిక్షణమూ మృత్యువు వెంటాడుతూ ఉంటుంది మానవుణ్ణి. వాల్మీకి మహర్షి చెప్పినట్టు సహైవ మృత్యుర్రజతి - సహమృత్యు ర్నిషీదతి - మృత్యువును వెంట బెట్టుకొనే నడుస్తున్నాము. కూచుంటున్నాము. గత్వా సుదూర మధ్వానం సహమృత్యు ర్నివర్తతే. బహుదూర దేశానికి ప్రయాణమై పోయినా మృత్యువుతోనే పయనిస్తున్నాము. మరలా దానితోనే తిరిగి స్వదేశానికి వస్తున్నాము. అలాంటప్పుడది మనలను వదిలి పెట్టిన దేది. పెట్టక పోతే ఇక జీవితమనే దాని కరమేది. మార్పే మృత్యువు. జీవితాంతమూ మార్పే గదా మనం చూస్తున్నది. మనసు మారుతున్నది. మాట మారుతున్నది. శరీర చేష్టలు మారుతున్నాయి. అవస్థలు మారుతున్నాయి. అందులో మనం పొందే అనుభవాలు మారుతున్నాయి. ఇక మృత్యువు గాక మిగిలిందేమిటి మానవుడికి.
ఇలాటి అగాధంలో నుంచి బయటపడాలంటే వాడికేదో ఒక దివ్య శక్తి తోడు పడాలి. అది అజమూ అమరమూ అయి ఉండాలి. అదే
Page 503
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు