#


Index

భక్తి యోగము

నిండిపోయింది కాబట్టి భయమను. మరొకటను. ఏ ఒక్క భావానికీ అవకాశం లేదు. అంచేత జ్ఞానికి తనతో కలుపుకొని సర్వమూ ఆత్మ స్వరూపంగా చూచి ఎలా భయం లేదో భక్తుడికి కూడా విశ్వరూపుడైన ఈశ్వరుడే సర్వత్ర కనపడుతుంటాడు కాబట్టి వాడికీ భయం లేదనే అనుకోవాలి మనం.

తేషా మహం సముద్ధర్తా- మృత్యు సంసార సాగరాత్
భవామి నచిరా త్పార్థ - మయ్యావేశిత చేతసామ్ - 7


  సరే గాని ఎవరైతే అలా అనన్యమైన భక్తి యోగంతో నన్ను భజిస్తుంటారో అని భగవానుడు ప్రస్తావించాడే వారి విషయంలో తానేమి చేయదలచాడు. అది చెప్పకుండా ముగించాడేమిటి. ముగించ లేదు. సావశేషం భగవానుడి వచనం. అది ఏమిటో ఇప్పుడు బయటపెడుతున్నాడు నెమ్మదిగా. ఏమని. తేషా మహం సముద్ధర్తా - యే ఉపాసతే ఎవరలా నన్ను భజిస్తున్నారో నని గదా ముందు పేర్కొన్నాడు. అలాటి వారందరినీ నేనుద్ధరిస్తానని హామీ ఇస్తున్నాడు. ఉద్ధరించట మంటే కరావలంబ మిచ్చి ఒడ్డున పడేయటం. అగాధ జలంలో మునిగి ఈది తీరంజేరే శక్తి లేక తలమునక లవుతుంటే అలాంటి వారిని తీరం జేర్చటమే ఉద్ధరణ మనే మాట కర్థం. పైకి చేదటమని శబ్దార్థం. మంచిదే. దేనిలో నుంచి ఉద్ధరించాలంటారు. మృత్యు సంసార సాగరాత్. అగాధ జలం సాగరమే.

Page 502

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు