మేమోనని చాలామంది పొరబాటు పడతారు. అది ముందుగానే ఊహించి దాని కర్ధం చెబుతున్నారు భగవత్పాదులు.
అనన్యమంటే భగవత్తత్త్వాన్ని తమ కభిన్నంగా చూడటమూ కాదు. దానికి తమ్ము అభిన్నంగా భావించటమూ కాదు. మరేమిటి. అవిద్యమాన మన్యత్ ఆలంబనం విశ్వరూపం దేవ మాత్మానం ముక్త్వా యస్య స అనన్యః - విశ్వరూప ధరుడైన పరమాత్మ తప్ప అన్యమైన మరొక ఆలంబన మెవరికి లేదో అది అనన్యం. అంటే సగుణంగా పరమాత్మను దర్శించే మార్గం. విశ్వేశ్వరుణ్ణి గాక విశ్వరూపుణ్ణిగా మనసుకు తెచ్చుకోటం. అలా తెచ్చుకోవాలంటే ఆలంబనం వారికి భగవానుడి విశ్వరూపమే. విస్వరూపోపాశన అంటారు దీన్ని The reality in its cosmic form. ໙໖ యోగం. యోగమంటే సమాధి. ఏకాగ్రత Meditation. విశ్వరూపాత్మకంగానే పరమాత్మను నిరంతరమూ దర్శిస్తూ కూచోటం. ఇదే సగుణ భక్తుల ధ్యానం. ఇదే వారి ఉపాసన. ఇదే సమాధి. వీడు పాసకుడు. అది వాడి ఉపాస్య దైవం. ఉపాస్యోపాసక రూపమైన సంబంధముంది ఇద్దరికీ. అది ఉన్నంత వరకూ సాయుజ్యం కాదది. మహా అయితే సామీప్యం సారూప్య మనుకోవచ్చు. ఉదర మంతరం కురుతే అని బృహదారణ్యకం చెప్పినట్టు ఏమాత్రం తేడా చూచినా అధ త స్య మహద్భయం భవతి - బ్రహ్మాండమైన భయమేస్తుందట. అయితే ఇక్కడ మనసంతా భక్తుడి కీ భావనతోనే
Page 501