#


Index

భక్తి యోగము

  ఇలాటి అక్షరోపాసకులైన జ్ఞానుల విషయం తరువాత చెప్పబోతాము. ప్రస్తుతం భక్తులైన వారి వ్యవహారమేమిటో అది చెబుతున్నా మంటున్నారు. భగవత్పాదులు. యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః - భక్తులైన వారెప్పుడూ సర్వత్రా సర్వమూ పరమాత్మేనని చూడలేరు. పరమాత్మనే ఈశ్వరుడని చూస్తారు. చూచి ఆ ఈశ్వరుడి యందే తాము చేసే కర్మలన్నీ సమర్పిస్తారు. మత్కర్మకృన్మత్పరమో అని గదా విశ్వరూపాధ్యాయం చివర వర్ణించారు భక్తుల వ్యవహారం. భక్తులకు పరమాత్మ ఈశ్వరుడుగా దర్శనమిస్తాడు. అంటే అవ్యక్తమైన తత్త్వం వ్యక్తమై కనపడాలి వారికి. అందుకే మయి ఈశ్వరే సన్న్యస్య అని అర్థం చెబుతున్నారు భాష్యకారులు అంతేకాదు. ఈశ్వరుడికే తాము చేసే ప్రతి పనీ అప్పజెప్పటమే గాక మత్పరాః ఇది సరిగా మత్పరమ అనే మాటకు సరిజోడు. అహం పరః యేషాంతే మత్పరాః నేనే ఎవరికి గమ్యమో పరాయణమో వారు మత్పరులంటారు. ఈశ్వరుడికే అన్నీ అప్పగించి ఆ ఈశ్వరుడే లోకంగా బ్రతికే వారన్న మాట. వారికే భక్తులని పేరు. మాంధ్యాయంత ఉపాసతే. అలాటి వారు చేసే పనేమిటి. మాంధ్యాయంతః భగవద్రూపాన్నే ధ్యానిస్తూ ఉపాసతే ఏకాగ్రతతో సమాధి సుఖమను భవిస్తుంటారు. నిజమే. కాని వారి కేమిటి ఆలంబనం. చెబుతున్నాడు భగవానుడు వినండి. అనన్యేనైవ యోగేన. అనన్యమైన యోగమే ఆలంబన మట వారి ధ్యానానికి. అనన్యమంటే ఇది జ్ఞాన

Page 500

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు