సాధ్యమని భగవానుడు చాటటం. దేహవద్భిః అంటే దేహాభిమానవద్భిః
అని కూడా చాటారు భాష్యకారులు. అభిమానమే అడ్డు పడుతున్నది
దేహంకాదు. దేహమే అయితే మరణంతో తీరిపోతున్నది గదా దేహంతో
సంబంధం. అప్పు డప్రయత్నంగానే మానవుడు ముక్తుడయి పోవచ్చు గదా
అని ప్రశ్న వస్తుంది. అలా కాక అభిమాన మనటం
వల్ల దేహం
పడిపోయినా అభిమాన మనేది వాసనారూపంగా వెంటాడు తుంటుంది.
కాబట్టి దాని నుంచి తప్పించుకోలేవు. అది మరలా ఒక స్థూల దేహాన్ని
వెతుక్కొంటూ పోయి అందులో వచ్చి పడుతుంది. కాబట్టి సమస్యకు
పరిష్కారం లేకుండా పోతుంది. ఇలాటి అభిమానమున్నంత వరకూ
అక్షరోపాసకుల కది దాటి పోవటమంత సులభం కాదు. క్లేశోధిక తరః
భక్తుల కంటే క్లేశ మధికతర మంటున్నాడు గీతాచార్యుడు. భక్తులు
భగవత్తత్త్వాన్ని తమ కన్యంగా చూస్తుంటారు కాబట్టి వారికి
దేహాభిమానమున్నా పరవాలేదు. మనసు భగవంతుడి మీద లగ్నమైతే చాలు.
ఇక్కడ అలాకాక అన్నీ పరమాత్మలో లయమై తాను పరమాత్మ రూపంగానే
మారిపోవాలి జ్ఞాని. అందుకే బ్రహ్మాండమైన క్లేశమిది.
యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే - 6
Page 499