#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  కాని అలాటి అశరీరాత్మ భావ మేర్పడటమే అసాధ్యం. ఈ దేహం మీద ఉన్న అభిమానం మనకా జ్ఞాన దేహం మీదికి బదిలీ అయిపోవాలి. ఇదే నేనని పెట్టుకొన్న అభిమానం దానిమీద పెట్టుకో గలగాలి మనం. ఆ మాటకు వస్తే దేహమనేది అసలు దానిపాటికది వాస్తవంగా ఎక్కడా లేదంటా రద్వైతులు. దేహం మన కొకటుందనే అభిమానమే Notion దేహం. అభిమానమే కాకపోతే జాగ్రత్తులో అభిమానించిన ఈ దేహం స్వప్నంలో ఏమయింది. అక్కడ దీన్ని పడక మీదనే వదిలేసి వేరొక శరీరాన్ని పట్టుకొని దానితో తిరుగుతుంటావు గదా. అది సుషుప్తిలో ప్రవేశించే సరికి దాన్ని కూడా వదిలేసి అయోమయమైన ఒక అవస్థలో పడిపోయావా లేదా. మళ్లీ తెల్లవారితేనే గదా ఇది నా దేహమని ఊరేగుతున్నావు. ఇక మరణంలో అయితే ఇది సర్వాత్మనా దక్కకుండా పోతున్నది నీకు. కనుక దేహం నీకు సహజం కాదు. నీస్వరూపం కాదు. ఆరోపితం. అలా ఆరోపించింది నీ అభిమానమే. అభిమానం పోతే చాలు. ఇది మాఫీ అయిపోతుంది. అశరీరమైన ఆకాశం లాంటిదా అసలు శరీరం. శరీరంగాని శరీరం చైతన్య శరీరం నీకు గుర్తుకు వస్తుంది. అయితే బహు జన్మ సంచిత వాసనా ప్రాబల్యం వల్ల ఈ దేహమే నేననే అభిమానం కరడుగట్టి పోయింది. దాన్ని కరగ దీయటం సామాన్యమైన విషయం కాదు. కనుకనే దేహవద్భి ర్దుఃఖ మవాప్యతే. అవ్యక్తమైన ఆ స్వరూప మందు కోటం దేహధారులక

Page 498

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు