#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

చిదాకారంగా మారిన చిత్తవృత్తితోనే నిర్వికల్పంగా పట్టుకోవాలా తత్త్వాన్ని. మరి ఎలాటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోనూ కాదు. కనుకనే మామేవ యే ప్రపద్యంతే అని హెచ్చరిస్తున్నది గీత. మామేవ అంటే నన్నే. కేవలం నా స్వరూపాన్నే. మరి దానికే నామమూ రూపమూ ఇలాటి విశేషాలేవీ చేర్చకుండానని అర్ధం. అలా చేర్చకుండా పట్టుకో గలిగితేనే మాయా మేతాం తరంతి తే మాయా క్షేత్రం మంచి తప్పించుకొని బయట పడగలరు మానవులు. మాయ అంటే గుణత్రయమే. విశేషాలే గుణత్రయ మంటే. నామమొక విశేషం. రూపమొక విశేషం. క్రియ ఒక విశేషం. ఇవే సత్త్వరజస్తమో గుణాలు. నామం సత్త్వమైతే క్రియ రజస్సైతే రూపం తమస్సు. మరి వాటిని దాటిపోవాలని కోరుతూ వాటినే దగ్గర పెట్టుకొంటే ఎలా. పరమాత్మ వాటిని దాటిపోయిన చైతన్యం. పోతే జీవుడి చైతన్యం వస్తుతః అదే అయినా ఈ విశేషాలను విడిచిపెట్టని నేరానికి అది కాకుండా పోయింది. ఇలాటి విశేష దృష్టి వదలనంత వరకూ నాభి జానాతి. నిర్విశేషమైన ఆ తత్త్వాన్ని గ్రహించలేడని గీత ఇంతకుముందు చెప్పిందంటే అక్షరాలా సత్యమే చెప్పిందది. అదే ఇప్పుడేమని చెబుతున్నది. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా స్వరూపాన్ని మాత్రమే ఎవరు గుర్తిస్తారో వారు గుణత్రయాన్ని నాలాగే దాటిపో గలరని ఆశీర్వదిస్తున్నది మనలను. పైకి చూస్తే ఇది అన్యోన్య విప్రతిషిద్ధం. లోతుకు దిగి చూస్తే ఎంతైనా హేతుబద్ధమైన ప్రసంగం. సవికల్పమైన మనస్సుతో పట్టుకోట మసాధ్యమని మొదటి మాట. అదే నిర్వికల్పంగా మారిన మనస్పైతే సాధ్యమేనని రెండవమాట. కాబట్టి వస్తువులో లేదు. వస్తు స్వభావాన్ని

Page 50

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు