#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

జ్ఞానం. వ్యాపకమయ్యే సరికి నిరాకార మవుతుంది. నిరాకారమైనా ఆకాశంలాగా జడం గాదు. చేతనం. ఒకరకంగా చెబితే చిదాకాశం con-scious space అప్పుడిక గుణత్రయం దానిమీద పనిచేయదు. ఆకాశం వరకే గుణం. దాన్ని కూడా వ్యాపించిన చైతన్యానికి కాదు.

  ప్రస్తుత మిలాటి పరమాత్మను పట్టుకోవాలను కొంటున్నది నీ జ్ఞానం. ఎలా పట్టుకోవాలీ జ్ఞానం దాన్ని. అది ఎలా ఉందో అలాగే పట్టుకోవాలి గదా. కశ్చిన్మాం వేత్తి తత్త్వతః అని ఇంతకుముందే వర్ణించింది గీత. నూటికి కోటి కొకడుంటాడా పరమాత్మనెలా ఉన్నాడో అలాగే పట్టుకొనేవాడు. ఎలా ఉన్నాదా తత్త్వం. నిరాకారం. సర్వవ్యాపకం. జ్ఞేయరహితం. కేవల జ్ఞాన స్వరూపమది. నామరూప క్రియలనే విశేషాలేవీ లేనిది. వాటన్నిటినీ పూర్తిగా తనలో లయం చేసుకొన్నది. అలాంటి దాన్ని దాని స్థాయికెదిగే పట్టుకోవాలి గాని లేకుంటే పట్టుకోగలవా. పట్టుకొన్నా మాత్రం పట్టు పడుతుందా. అలా పట్టుపడకనే గదా ఆయా అవతారాలుగా విగ్రహాలుగా మంత్రాలుగా మంత్రాధి దేవతలుగా ఏదో ఒక రూపం దానికి తగిలించి ఆ మేరకు దాన్ని దించి అలాటి ఆలోచనతోనే దాన్ని పట్టుకొని అదే పరమాత్మ అని తృప్తి పడి అక్కడికే ఆగిపోతున్నాడీ మానవుడు. వీడి ఆలోచన నామం. దాని కనుగుణంగా వీడు పట్టుకొన్నది రూపం. ఆ పట్టుకొని దాన్ని ఆరాధిస్తూ కూచోటం క్రియ. నామరూప క్రియాత్మకమిది ప్రపంచమా పరమాత్మా నీవే చెప్పు.

  కాబట్టి పరమాత్మ నున్నదున్నట్టు పట్టుకోవాలంటే నామరూప క్రియాత్మకంగా గాక అవేవీ మనసుకు రానీయకుండా కేవలం సదాకారంగా

Page 49

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు