గ్రహించబడే రూపం దానికి ప్రమేయం Object of Knowledge. అలాగే ఇప్పుడు పరమాత్మ నీ జీవాత్మ గ్రహించా లనుకోండి. ఎలా గ్రహిస్తాడు. వీడిలో జ్ఞానమనే ప్రమాణముంది గదా. గ్రహించవచ్చు. మరి ఎందుకు గ్రహించలేక పోవటం. ఏ విషయాన్ని గ్రహించాలన్నా దానికి సంబంధించిన ఆలోచన లేదా వృత్తి అనేది ఏర్పడుతుంది మన జ్ఞానానికి. దీనికే వృత్తిజ్ఞానమని. The idea of the object పేరు. శబ్దాన్ని రూపాన్ని గ్రహిస్తున్నామంటే ఇది శబ్ద మిది రూపమనే తదాకారమైన వృత్తి ఏర్పడటం వల్లనే వాటిని మనం తెలుసుకో గలుగుతున్నాం.
అలాగే ఇప్పుడు పరమాత్మాకారమైన వృత్తి ఏర్పడాలి ఈ జీవాత్మకు. పరమాత్మ ఎలా ఉన్నాడో అలాగే పట్టుకోవాలీ జీవుడి జ్ఞానం దాన్ని. ఎలా ఉన్నాడు పరమాత్మ. అఖండమైన సర్వవ్యాపకమైన జ్ఞానమే పరమాత్మ స్వరూపం. అలాంటి జ్ఞానమే ఉండాలిప్పుడీ జీవుడికి కూడా ఉందా. జ్ఞానమైతే ఉంది. అంతవరకూ పరవాలేదు. మరేమిటి ఇబ్బంది. అది పరిపూర్ణం కాదు. వ్యాపకం కాదు. అదే ఇబ్బంది. ఎందుకు కాదు. విశేష జ్ఞానం మనకున్న జ్ఞానం. సామాన్యం కాదు. అంటే ఇది ఇల్లు ఇది వాకిలి ఇది భార్య ఇది బిడ్డలు - ఇవి వస్తువాహనాలు - అని ఎక్కడికక్కడ విశేషాల తాలూకు జ్ఞానమే మనకుంటున్నది. మరి పరమాత్మ జ్ఞానమో. అది ఇల్లు కాదు వాకిలిగాదు భార్యగాదు బిడ్డ కాదు. ఎక్కడికక్కడ ఒకానొక రూపానికీ ఆలోచనకూ పరిమిత మయింది కాదు. అన్నిటినీ వ్యాపించిన
Page 48