మరి ఇప్పుడా పైకి లేచి ప్రకృతి గుణాలు దాటి పోవటమెలాగా అని ప్రశ్న వస్తే దానికి భగవానుడు మనకిచ్చే సలహా ఇది. మా మేవ యే ప్రపద్యంతే - మాయా మేతాం త రంతి తే. నన్నే ఎవరు పట్టుకొంటారో వారీ మాయా శక్తిని దాటి బయటపడ గలరని హామీ ఇస్తాడు. ఏమిటి దీని అర్ధం. ఇంతకు ముందేమని చెప్పాడు. మోహితం నాభి జానాతి మామేభ్యః పర మన్నాడు. ప్రకృతి గుణాలు నిన్ను కట్టి పారేశాయి. నీవు చస్తే నన్ను పట్టుకోలేవు. నేనీ ప్రకృతి గుణాల నతిక్రమించి ఉన్నాను. నన్ను నీవు గుర్తించట మసాధ్యమని గదా బెదరగొట్టాడు మనలను. అలా బెదిరించిన వాడిప్పుడేమని హామీ ఇస్తున్నారు. నన్ను గుర్తిస్తే చాలు నీవు త్రిగుణాల వాగుర నుంచి తప్పించుకొని నాలాగే దర్జాగా ఉండగలవని వరమిచ్చినట్టు మాటాడుతున్నాడు. ఏమిటిది. పరస్పర విరుద్ధంగా లేదా ఈ మాట. నన్ను తెలుసుకోటం సాధ్యం కాదంటూ తెలుసుకోండి నా స్వరూప మంటాడేమిటి మరలా.
ఇక్కడే ఉంది రహస్యం. మానవుడేదైనా ఒకటి తెలుసుకో వాలంటే దేనితో తెలుసుకోవాలి. మనస్సుతో. మనసులో ఏముంది. జ్ఞానం. జ్ఞానానికే ప్రమాణమని పేరు. ప్రమాణంతో ప్రమేయాన్ని గ్రహిస్తా మెప్పుడే గాని. కన్ను రూపాన్ని చూస్తుంది. చెవి శబ్దాన్ని వింటుందంటే ఏమిటర్ధం. కన్నూ చెవీ వీటి ద్వారా మన జ్ఞాన మనే ప్రమాణం జ్ఞేయమైన శబ్దరూపాదులను గ్రహిస్తున్నది. రూపజ్ఞానం ప్రమాణమైతే దానిచేత
Page 47