#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

దానిలాగా ప్రకాశాత్మికే కావలసి ఉంది. అది దానికి స్వతంత్రం కాకపోయినా స్వతంత్రుడైన ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంది గనుక ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇదే మమ మాయా. నామాయ అని పేర్కొనటంలో ఉన్న ఆంతర్యం.

  కాగా ఇలాంటి చైతన్య ప్రకాశమే జీవుల మనిపించుకొనే మనలో కూడా గుప్తంగా ఉన్నది. నేను నేననే స్ఫురణతోనే గదా బ్రతికినంత కాలమూ బ్రతుకుతుంటాము మనం. ఆ స్ఫురణతోనే నేనున్నానని ఎలా గ్రహిస్తున్నామో నా చుట్టూ కనిపించే ఈ ప్రపంచాన్ని కూడా ఉన్నట్టు గుర్తిస్తున్నామా లేదా. ఇది మనలో ప్రతి ఒక్కరికీ అనుభవ సిద్ధమే. అంచేత మనకిప్పు డదే తోడుపడాలి. అదే ద్వారమంటారు భగవత్పాదులు పరతత్త్వాన్ని అందుకోటానికి. అదీ చైతన్య ప్రకాశమే. మనమూ చైతన్య ప్రకాశమే. చైతన్యం చైతన్యం సజాతీయం. గుణంలో ఒకటే. కాని పరిమాణంలోనే తేడా వచ్చింది. అది అఖండమైన ప్రకాశమైతే ఇది సఖండం. దేహేంద్రియా ద్యుపాధులతో చేయి కలిపి వాటి స్థాయికి పడిపోయింది. వాస్తవంగా పడకున్నా పడ్డట్టు భాసిస్తున్నది. దానికి కారణమీ ప్రకృతి గుణాలే. అవే గదా దేహేంద్రియాది రూపాలుగా మారి మనలను చుట్టేశాయని చెప్పటం. అప్పటికి దైవ గుణమూ ఉంది మనలో. మాయా గుణమూ ఉంది. తొంభయి పాళ్లు మాయా గుణాలైతే పదిపాళ్లైనా దైవగుణముంది. కాబట్టి అంత భయం లేదు. ఎలా పడిపోయామో అలా పైకి లేచే అవకాశముంది మరలా. అందుకే అసాధ్యమే గాని బొత్తిగా అసంభవం కాదని చెప్పింది.

Page 46

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు