#


Index

భక్తి యోగము

తత్త్వం. అది నీకు విషయం కూడా కాదు. విషయి. అంటే ఆత్మ స్వరూపమే నంటారు భగవత్పాదులు.

  అలాటి నిర్గుణోపాసన మాటలు గాదు. చాలా కష్ట సాధ్యం. ఎంతో శిక్షణ ఉండాలి సాధకుడికి. సన్నియమ్యేంద్రియ గ్రామం. బహిరంత రింద్రియాల నన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి మొదట. సర్వత్ర సమబుద్ధయః - చరా చర పదార్ధాలేవి తటస్థ పడుతున్నా నిష్పక్ష పాతమైన బుద్ధితో చూడగలిగి ఉండాలి. అంతే కాదు. సర్వభూత హితే రతాః సమస్త భూతాల విషయంలోనూ వాటి మేలుకోరి ప్రవర్తించాలి. ఇష్టంగాని తన కనిష్టంగాని ఏది ఎప్పుడు సంభవించినా కంగారు పడకుండా సమదృష్టితో స్వీకరిస్తూ పోవాలి. ఎప్పుడేర్పడుతాయి ఇలాటి గుణాలు. ఆత్మనే సర్వత్రా చూస్తే గాని ఏర్పడవు. ఇలాటి ఏకాత్మ భావం జ్ఞానికి తప్ప భక్తుడికి ఉండటం చాలా అరుదు. వాడు సృష్టిలో ఏక దేశాన్నే పట్టుకొంటాడు గాని సమస్త సృష్టినీ తన స్వరూపంగా చూడలేడు. పైగా తనకూ తన ఆరాధ్య దైవానికీ తేడా చూస్తూ దాన్ని భజిస్తాడే గాని అది కూడా తన స్వరూపమేనని భావించలేడు. ఇవి రెండే ఇద్దరికీ ఉన్న తేడా. కేవల భక్తులు భగవంతుడికి సన్నిహితులే గాని భగవత్స్వరూపులు కారు. అలాటి వారక్షరోపాసకులైన జ్ఞానులు మాత్రమే. కనుకనే భక్తులను గురించి చెప్పినట్టు జ్ఞానులను గూర్చి యుక్తతములని గాని మరొక రని గాని పేర్కొన

Page 494

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు