ఆత్మసంయమ యోగము
భగవద్గీత
నక్కర లేదు. కారణమేమంటే తే ప్రాప్నువంతి మామేవ వారు స్వయంగా నన్నే పొందుతారంటాడు పరమాత్మ. జ్ఞానీత్వాత్వై మేమతమని గదా ఇంతకు ముందు చెప్పిన మాట. జ్ఞాని భగవత్స్వరూపుడే. ఇక వారి నిలాటి వారలాటి వారని పొగడటం దేనికి. నహి భగవత్స్వరూపాణాం సతాం భగవత్స్వరూపులే అన్నప్పుడు యుక్తతమత్వ మయుక్తతమత్వం వా వాచ్యం. యుక్తతములా అయుక్తతములా అని వా కొనరాదు. అని సెలవిస్తారు భాష్యకారులు. భగవంతుడిలాగే వర్ణనాతీతమైనది వారి స్వభావం.
క్లేశో ధిక తరస్తేషా మవ్యక్తా సక్త చేతసాం
అవ్యక్తాహి గతి ర్ధుః ఖం - దేహ వద్ధి రవాప్యతే - 5
కాని ఒక్కటే ఒక ఇబ్బంది ఉంది వారి విషయంలో. అదేమిటంటే క్లేశోధిక తరస్తేషాం - క్లేశమంటే అభ్యాసం చేయటంలో కష్టం. అది భగవత్సేవా పరాయణుడైన భక్తుల కెలాగూ ఉంటుంది. అనుక్షణమూ తమ కారాధ్యమైన దైవం మీదనే చూపు పెట్టుకొని ఆ స్మృతి ఏమరకుండా మనోవాక్కాయ వ్యాపారాలన్నీ సాగిస్తూ పోవటం సామాన్యం కాదు. కష్టమే. అయితే అంతకన్నా కష్టతర మీ అక్షరోపాసకులైన జ్ఞానుల వ్యవహారం. కారణమేమంటే అవ్యక్తాసక్త చేతసాం. భక్తులకు లక్ష్యమనేది ఏదో ఒక రూపంలో వ్యక్తమయి కనిపిస్తుంటుంది. దానిమీద మనసు పెట్టటం కొంతకు కొంత సులభం. ఇక్కడ జ్ఞానుల విషయమలా కాదు. అవ్యక్తమైనది
Page 495