#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

వీరి లక్ష్యం. అది కూడా ఆత్మ స్వరూపం. ఆత్మ గనుకనే అనాత్మ లాగా సాకారం కాదు. నిరాకారం. నిరాకారమైతే అది ఎదటికి వచ్చి కనిపించేది. కాబట్టి ఎప్పుడూ అవ్యక్తమే. మరి దానిమీద మనసు ఆసక్తం కావాలంటే ఎంత అసాధ్యమో ఆలోచించండి.

  దీనికంతటికీ కారణమొక్కటే. అవ్యక్తాహి గతి ర్దుఃఖం దేహవద్భి రవాప్యతే. దేహమనే ఉపాధిని కేవలమొక ఉపాధి Adjunct అని మాత్రమే చూడక అది నేనేనని దానితో తాదాత్మ్యం చెందటం. దానితో మమేకమై Totally identified పోవటం. అందువల్ల నాదిగా ఉండవలసిన దేహం నేనయి కూచుంది. దేహమంటే శరీరమూ ఇంద్రియాలూ - మనస్సూ ప్రాణమూ ఈ కలాపమంతా కలిసి అది దేహం. ఇది నేనుగా ఎప్పుడు భావించానో దాని లక్షణాలన్నీ నావిగానే మారిపోయాయి. అవే షడూర్ములని పేర్కొంటారు వేదాంతులు. స్థూల దేహానికి సంబంధించి జరా మరణాలు. సూక్ష్మ దేహమైన ప్రాణానికి సంబంధించి క్షుత్పిపాసలు. అందులో గూడా మనస్సుకు సంబంధించి మోహ శోకాలు. వీటన్నిటికీ అసలు కారణ మవిద్య లేదా అజ్ఞానం. అది కారణ శరీరం. ఈ శరీర త్రయమే ఆత్మకుపాధి. అదంతా మమగా గాక అహంగా మారి కనిపిస్తున్న దిప్పుడు. దానితో దాని గుణాలన్నీ పరిశుద్ధమైన మన ఆత్మ చైతన్యం మీద వచ్చి పడ్డాయి. దీనికే అధ్యారోప Super imposition మని పేరు. ఇది వాస్తవంగా జరిగింది

Page 496

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు