భక్తి యోగము
భగవద్గీత
బీజమంత ర్దోషవత్ - అవిద్యా కామకర్మాది అనర్థాల కన్నిటికీ నిలయమైనది గనుక కూటమని పేరు మాయాశక్తికి. తస్మిన్ కూటే స్థితం కూట స్థం తద ధ్యక్ష తయా. అలాటి కూటరూపమైన మాయా శక్తి కధ్యక్షుడయి ఉన్నాడు గనుక పరమాత్మను కూటస్థుడని పేరంటారు భగవత్పాదులు. అధవా రాశి రివ స్థితం కూటస్థమని కూడా అర్థం చెబుతారు. చరా చర పదార్ధాలు పోగయినట్టు సమష్టి రూపంగా ఉన్నదట పరమాత్మ తత్త్వం. అచలం ధ్రువం. అందుకే అది నిశ్చలమైనది నిత్యమైనది.
పోతే ఏవం విధ విశేషణ విశిష్టమైన ఆ పరమాత్మ తత్త్వాన్ని ఎవరైతే పర్యుపాసతే - పరి సమంతా దుపాసతే - సర్వత్ర పరుచుకొని ఉన్నట్టు చూచి అనుభవానికి తెచ్చుకొంటారో వారక్షరో పాసకులు. అస లు పాసన అంటే ఏమిటో అర్థం చెబుతున్నారు భాష్యకారులు. ఉపాసనం నామ యధాశాస్త్రం ఉపాస్యస్య అర్ధస్య విషయీ కరణేన సామీప్యముప గమ్య తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యదాసనమ్ తదుపాసన మాచక్షతే. శాస్త్రోక్తమైన మార్గంలో తాను భావించ వలసిన విషయ మేముందో దాన్ని తనకు లక్ష్యంగా చేసుకొని సమీపంగా వెళ్లి తైల ధారలాగా ఒకే విధమైన భావాన్ని ప్రవాహ న్యాయంగా పాటిస్తూ దీర్ఘకాల మలాగే కూచొని పోవటాని కుపాసన మని పేరు. ఉప సమీపంగా ఆసన కూచోటమని గదా శబ్దార్థం. ఇప్పుడలాంటి లక్ష్యమే ఈ అక్షరమైన
Page 493