#


Index

భక్తి యోగము భగవద్గీత

గూర్చి ఏమి చెప్పాలో అది చెబుతున్నాడిప్పుడు భగవానుడు వినండి. అని అక్షరోపాసకులైన జ్ఞానుల విశిష్టత ఏదో ఇప్పుడు భగవానుడి మాటలలోనే బయటపెడుతున్నారు స్వామివారు.

యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే
సర్వత్రగ మచింత్యంచ - కూటస్థ మచలం ధ్రువమ్ - 3

సన్నియ మ్యేంద్రియ గ్రామం - సర్వత్ర సమబుద్ధయః
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః - 4


  ఏమిటది. ఎలా ఉంటుంది. అక్షర మనిర్దేశ్య మవ్యక్తమట. క్షరం కాని దేదో అది అక్షరం. క్షరమంటే జారిపోయేది. నశించేది. అలాంటిది కాని దక్షరం. శాశ్వతమైన పదార్థం. కనుకనే అనిర్దేశ్యం. ఇదమిత్థమని పేర్కొన లేము దాని స్వరూపాన్ని. ఏమి కారణం. అవ్యక్తమది. నకేనాపి ప్రమాణేన వ్యజ్యత ఇతి అని నిర్వచిస్తున్నారు భాష్యకారులు. ఏదైనా మనం ఫలానా వస్తువని చెప్పాలంటే దానికేదో ఒక ప్రమాణ ముండాలి. ప్రమాణం వల్లనే అది వ్యక్తమవుతుంది. అంటే ప్రకటమై కనిపిస్తుంది. ఏ ప్రమాణమూ పనిచేయక పోతే అది అవ్యక్తమే. ఏమిటది. ఆత్మ తత్త్వం. నేననే స్ఫురణ. అది తనకు తాను తప్ప మరిదేనికీ గోచరంకాదు. అలా గోచరమైతే అది నేను గాదు నాదవుతుంది. అంటే ఆత్మ కాదనాత్మ అవుతుంది.

Page 491

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు