#


Index

భక్తి యోగము భగవద్గీత

  అర్జునుడే మడిగాడు. అక్షరోపాసకులైన జ్ఞానులలో సగుణోపాసకులైన భక్తులలో ఎవరు యుక్తతములని గదా అడిగాడు. ఇప్పుడు దానికేమని జవాబిస్తున్నాడు కృష్ణుడు. భక్తులే యుక్తతములన్నాడు. అప్పటికి జ్ఞానులేమయినట్టు. వారు యుక్తతములు కారా. కారనే అనుకోవాలి. భక్తులే యుక్తతములని వారికే సర్టిఫికే టిచ్చాడు గాని వారికివ్వ లేదు గదా. అంచేత భక్తుల కంటే వారు తగ్గు రకమని అనుకోవలసి వస్తుంది ఆయన మాటల ధోరణిని బట్టి. ఇది మిగతా మతాచార్యులకూ మనబోటి వారికీ ఏమో గాని భగవత్పాదుల లాంటి అద్వైత జ్ఞాన సంపన్నుల కేమాత్రమూ సరిపడని వ్యవహారం. అందుకే ఆయన ఉలిక్కిపడి ముందుగా దానికి సంజాయిషీ ఇచ్చుకొంటున్నాడు. యేతు అక్షరోపాసకాః సమ్యగ్దర్శినః నివృత్తైషణాః ఎవరైతే అక్షరోపాసకులూ సమ్యగ్దర్శన సంపన్నులైన జ్ఞానులున్నారో - తే తావ త్తిష్ఠంతు. వారినలా ఉండనివ్వండి. తాన్ ప్రతి యద్వక్తవ్యం తదుపరిష్టా ద్వక్ష్యామః వారిని గురించి మేమేది చెప్పాలో అది తరువాత చెబుతాం. యేతు ఇతరే. ఎవరా జ్ఞానుల కాని వారున్నారో వారిని గూర్చి చెప్పే మాట ఇది.

  అయితే జ్ఞానుల మాటేమిటి. కిమితరే యుక్తతమా నభవంతి. వారు యుక్త తములు కారా. న. కారని గాదు అర్థం. కింతుతాన్ ప్రతి యద్వక్తవ్యం. తత్ శృణు. వారు యుక్తతములనీ కారనీ గాదు చెప్పవలసిన మాట. వారిని

Page 490

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు