#


Index

భక్తి యోగము భగవద్గీత

జ్ఞానులు గొప్పవారా అని. సాకారమైతే ఈశ్వరుడు. నిరాకారమైతే బ్రహ్మం లేదా పరమాత్మ. ఇందులో ఎవరిని పట్టుకొన్న వారు యోగవిత్తములో తెలుసుకోవాలని అతని ఉబలాటం. అర్జునుడు నిజంగా జ్ఞానే అయితే ఈ ప్రశ్న వేయనే వేయడు. జ్ఞాని అయితే భక్తి అందులో కలిసి వస్తుంది. అప్పుడేది గొప్ప అని ప్రశ్నే రాదు. కేవలం భక్తుడు గనుకనే అది మాత్రముంటే చాలు నని చెబుతాడో లేదో తెలుసుకొని అక్కడికే ఆగిపోదామనే భావంతో అడుగుతున్నాడీ ప్రశ్న. అందుకే రెండింటికీ ఉన్న సమన్వయం గుర్తించక రెండూ పరస్పర భిన్నమైన మార్గాలనే భ్రాంతి కూడా ఉందతనికి. అతనికే గాదు. అతనికే గాదు. ఇలాటి భ్రాంతి అస్మదాదుల కెందరికో ఉంది ఈరోజుల్లో కూడా. అది పోగొట్టటానికే ప్రయత్నిస్తూ భక్తి తన పాటికి తాను స్వతంత్రంగా ఫలితమివ్వదని మొదటనే చెబితే అది కూడా పాటించక అర్జునుడి బోటి వారందరూ వదిలేస్తారేమోనని భయపడి భక్తి ఏమీ తక్కువది కాదు సుమా అని ముందుగా దాన్ని ప్రశంసిస్తున్నాడు.

మయ్యావేశ్య మనో యే మాం నిత్య యుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతా - స్తే మే యుక్త తమా మతాః - 2


  మయ్యా వేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే. నామీదనే మనసు లగ్నం చేసి విశ్వరూపుడనైన నన్నే ఎవరు నిత్యమూ భజిస్తుంటారో.

Page 488

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు