అందులో మొదటి భూమిక భక్తి. రెండవ భూమిక అనన్య భక్తి. లేదా జ్ఞానం. మొదటిది రెండవ దానికి చేరిస్తే ఆ రెండవది సాక్షాత్తుగా మోక్షమనే ఫలాన్ని రుచి చూపుతుంది మనకు.
ఇదీ సమన్వయం. ఈ దృష్టితో చూస్తే సగుణ నిర్గుణాల కే లాటి వైరుధ్యం లేకపోగా ఒకదానికొకటి చక్కగా సమన్వయ మవుతాయి. ఏకం సాంఖ్యంచ యోగంచ అనే చోట ఇంతకు ముందు మేమీ రహస్యాన్నే చక్కగా నిరూపణ చేశాము. అంతేకాదు. మనం చేయటమలా ఉంచి భగవద్గీతే చాటి చెబుతున్నది భక్తికీ జ్ఞానానికీ ఉన్న అనుబంధ మెలాంటిదో. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం. నామీద ఎంతో ప్రేమ గలిగి నన్నే నిత్యమూ భజించే భక్తులందరికీ దదామి బుద్ధి యోగం తం నేను జ్ఞాన యోగమనేది ప్రసాదిస్తాను. యేన మాముప యాంతి తే. ఆ జ్ఞానం ద్వారానే వారు నా స్వరూపమేదో దాన్ని దర్శించి కృతార్థులు కాగలరని విభూతి యోగంలో భగవానుడే స్పష్టంగా చాటి చెప్పాడు. కాబట్టి భక్తికీ జ్ఞానానికీ ఎప్పుడూ చుక్కెదురు లేదు. భక్తి జ్ఞానానికి దారి తీస్తే జ్ఞానం మోక్షమనే ఫలాన్ని మనకందిస్తుంది. ఇదీ వాటికున్న ఆంతర్యం.
ఈ సూక్ష్మం గుర్తించే శక్తి లేక ప్రశ్నిస్తున్నాడిప్పు డర్జునుడు. నిన్ను నిత్యమూ సాకారంగా సేవించే భక్తులు గొప్పవారా. నిరాకారంగా భావించే
Page 487