#


Index

భక్తి యోగము

బయటపడదు. మనమెప్పు డజ్ఞాన దృష్టితో చూస్తామో అప్పుడది మనకలా సగుణంగా ప్రకటమై భాసిస్తుంటుంది. అలా భాసించటానికి మనమే బాధ్యులం. అజ్ఞాన దృష్టి కెప్పటికైనా తిలాంజలి ఇచ్చి జ్ఞానమనేది సంపాదించి ఆదృష్టితో చూచామో మనకే మరలా ఆ తత్త్వం నిర్గుణంగా అవ్యక్తంగా అనన్యంగానే అనుభవానికి వస్తుంది. దీన్ని బట్టి మనమే కల్పించా మాయనకు రెండు రూపాలు. అందులో ఒకటి మనం కల్పించకుండానే సహజంగా ఆయనకున్న రూపం. అది అవ్యక్తం నిర్గుణం. కేవల మహంతా రూపంగానే ప్రకాశిస్తుంటుందది. మనం చూచినా చూడకపోయినా వస్తుతంత్రంగా ఉండేదది. దానికే బ్రహ్మమని తత్త్వమని పరమాత్మ అని పేరు. దానినే మన సౌకర్యం కోసం మన స్థాయికి దించి వ్యక్తంగా సగుణంగా భావిస్తే అది ఆ పరమాత్మకు మన మారోపించిన రూపం. దీనికే ఈశ్వరుడని భగవానుడని పేరు పెట్టాము. విశ్వరూపుడీ ఈశ్వరుడే. ఈయనే మనమనుకొనే దేవుడు. ఇది అసలైన స్వరూపం కాక పోయినా అదే మన దృష్టి మాంద్యం వల్లనైతే నేమి తన మాయా ప్రభావం వల్ల నైతే నేమి ఈశ్వరుడనే ఆకారంలో దర్శన మిస్తుంటుంది.

  తాత్త్వికమైన జ్ఞాన దృష్టితో చూస్తే ఇది తత్త్వం కాక కేవలం దాని ఆభాసే గనుక దీన్నే తత్త్వమని భావించట మవివేక మజ్ఞానమని ఆక్షేపిస్తున్నది భగవద్గీత. మరి తనపాటికది ఆభాస అయినా అసలైన

Page 485

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు