నిరాకారమైన తత్త్వమే సగుణంగా సాకారంగా కూడా భాసించగలదు. అదే ఈ విశ్వరూపం. అలా విశ్వరూపంగా భాసిస్తున్నాడంటే దానికి కారణ మాయన యోగమాయా ప్రభావమనండి. లేదా మనబోటి జీవుల అవిద్యా ప్రభావమనండి. ఏదైనా కావచ్చు. దీనికెంతో దూరం పోయి మనం వెతకనక్కర లేదు. రజ్జు సర్ప దృష్టాంతమే తీసుకొని చూడండి. తెలిసిపోతుంది. ఒక రజ్జువు చీకట్లో మనకంటికి సర్పాకారంగా కనిపిస్తున్న దంటే ఏమి కారణం. మనం దాన్ని రజ్జువని పోల్చుకోలేక దృష్టి దోషం వల్ల సర్పమని భ్రాంతి పడటం వల్ల గదా సర్పాకారంగా కనిపించటం. అలాగే ఆ రజ్జువులో కూడా సర్పంగా భాసించే స్వభావం లేకపోతే తదాకారంగా భాసించ గలదా. సన్నగా పొడవుగా గాలికి కదిలే లక్షణం సర్పాని కున్నట్టే రజ్జువుకూ అంతర్గతంగా ఉంది. అందుకే అలా భాసించటం. దీన్ని బట్టి పరమాత్మ ప్రకృతీ మనబోటి జీవుల అవిద్యా ప్రకృతీ రెండూ తోడు దొంగలలాగా కలిసి ఆడే నాటక మీ జగన్నాటకం. పరమాత్మకు విశ్వాకారంగా కనిపించే స్వభావ మసలు లేకపోతే మనం చూచినా అలా సగుణంగా కనిపించడు. అలాగే మనలో ఆయన నలా వ్యక్తంగా భావించే గుణం లేకపోతే జగద్రూపంగా వ్యక్తమయి మనకు కనిపించడు.
అయితే ఒక్క మాట. ఆయనలో ఎంత శక్తి ఉన్నా అంతర్గతంగా ఆయనతో ఏకమై ఉండవలసిందే దాని ఆశక్తి నిర్నిమిత్తంగా దానిపాటికది
Page 484