దీన్నిబట్టి ఏమర్ధం చేసుకోవాలి మనం. వ్యక్తమైన రూపం పరమాత్మ కాదనేగా. అలా కానప్పుడలాటి రూపంతో పరమాత్మను పట్టుకొంటే అది భక్తి ఎలా అవుతుంది. భక్తే కాదు న్యాయమైతే. కాదనే చెబుతున్నాడు భగవానుడు వాచా. మరి ఆ పరమాత్మే మరలా ఏమంటున్నాడో చూడండి. అనన్యాశ్చింత యంతో మాం. సతతం కీర్తయంతో మాం ఇలా నన్ను నామరూపాత్మకంగా వ్యక్తమైన రూపంతో కూడా పట్టుకోవచ్చు నని సలహా ఇస్తున్నాడు. మత్కర్మకృ న్మత్పరమః అని పూర్వాధ్యాయాంతంలో సెలవిచ్చిన మాట కూడా అదే. ఏమిటది. అలా నన్ను భజిస్తూ పోతే అహ మేవం విధః విశ్వరూప ప్రకారః శక్యోజ్ఞాతుమ్. విశ్వరూపుడనైన నన్ను తెలుసుకో గలుగుతావని సలహా ఇస్తాడర్జునుడికి. విశ్వరూపోపాసన అంటారట దీన్ని. భగవత్పాదులు పేర్కొంటారు. ఇంతకూ వ్యక్తమా అవ్యక్తమా భగవత్తత్త్వం. అవ్యక్తమని ఒక మారూ వ్యక్తమని ఒక మారూ తానే చెప్పట మేమిటాయన. అంతేగాక అవ్యక్తంగా దర్శించక పోతే అది నీ అవివేక మని తానే ఆక్షేపించి వ్యక్తంగా నన్ను భజించు. అదీ మంచిదేనని మరలా మనకు సలహా ఇవ్వటం పరస్పర విరుద్ధమైన ప్రసంగం గదా. దీనికేమిటి సమన్వయమని ఇప్పుడు ప్రశ్న.
దీనికి సమాధాన మేమంటే అసలు భగవత్స్వరూప మెప్పుడూ అవ్యక్తమే. వ్యక్తం స్వరూపం కాదు. అది దాని విభూతి. అంటే నిర్గుణ
Page 483