#


Index

భక్తి యోగము

పక్షయోః కనుక రెండు మార్గాలు పేర్కొన్నా విప్పుడు నీవు. ఒకటి అక్షరోపాసన. రెండోది ఈశ్వరోపాసన. నిర్గుణ ధ్యాన మొకటి. సగుణ ధ్యాన మొకటి. అంటే ఒకటి జ్ఞాన రూపమైన అనన్యభక్తి. మరొకటి జ్ఞానానికి దూరమైన కేవల భక్తి. విశిష్టతర బు భుత్సయా త్వాం పృచ్ఛామీతి అర్జున ఉవాచ. ఈ రెండింటిలో ఏది ప్రశస్తమైన మార్గమో తెలుసుకోవాలని ఉంది నాకు చెప్పమని అడుగుతున్నా డిప్పుడర్జును డంటా రాయన. అంటే ఏమన్న మాట. విశ్వరూపాత్మకంగా దర్శనమిచ్చే ఈశ్వరుడి రూపాన్నా మనం భజించవలసింది. అలా కాక విశ్వాతీతమైన నిర్గుణ నిరాకార సర్వవ్యాపకమైన బ్రహ్మ స్వరూపాన్నా అని ప్రశ్న.

ఏవం సతత యుక్తా యే- భక్త్వా స్త్వాం పర్యుపాసతే
యే చా ప్యక్షర మవ్యక్తం - తేషాంకే యోగవిత్తమాః -1


  అదే అడుగుతున్నాడిప్పు డర్జునుడు. ఇంతకు ముందు గడచిపోయిన అధ్యాయం చివర భగవానుడు కడసారిగా అన్న మాటేమిటి. మత్కర్మకృత్. ప్రతి ఆలోచనలో మాటలో చేష్టలో నేనే నీకు కనపడుతుండా లర్జునా. నీ జీవితమంతా నాకే అంకితం చేసి జీవించమని ఆదేశించాడు. ఏవం సతత యుక్తాః ఆ ప్రకారంగా భగవదాదేశాన్ని పాటిస్తూ నిరంతరమూ భగవత్సేవలోనే నిమగ్నులయి భక్తాస్త్వాం పర్యుపాసతే. భగవానుడు తప్ప విడిచి వేరొక శరణ్యమే లేక బ్రతుకుతూ ఆయన చూపే ఈ విశ్వరూపమే

Page 481

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు